News March 27, 2025
శరీరంపై ఎక్కువ బ్యాక్టీరియాలు ఉండేది ఇక్కడే..

జననాంగాల్లో బ్యాక్టీరియా ఎక్కువని అంతా అనుకుంటాం. కానీ వాటికంటే అధికంగా క్రిములుండే భాగాలున్నాయి. నోటిలోని పళ్లు, నాలుక తదితర భాగాలతో పాటు నాభి/బొడ్డు, చంకలూ వేల బ్యాక్టీరియాలకు ఆవాసాలు. అటు గాలితో పాటు ముక్కులోకి వేల సంఖ్యలో ఇవి చేరుతాయి. ముక్కు రంధ్రాల్లో వేలు పెడితే వేళ్లకూ అంటుతాయి. ఇక గోర్లలో (ముఖ్యంగా చేతుల) వేల కొద్దీ బ్యాక్టీరియాలుంటాయి. వీలైనంత శుభ్రంగా ఉండటమే వీటిని పారదోలే మార్గం.
Similar News
News April 19, 2025
టైట్ డ్రెస్‌లు వేసుకుంటే..

టైట్‌గా ఉండే దుస్తులు వేసుకోవడం వల్ల నడుము, కాళ్ల వద్ద రక్త ప్రసరణ సరిగ్గా జరగదు. కాబట్టి వాపు రావడం, రక్తం గడ్డకట్టడం లాంటివి జరుగుతాయి. పలు రకాలైన చర్మ సమస్యలతో పాటు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారుతుంది. బిగుతైన దుస్తులు ధరించడం వల్ల ఆడవారిలో రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. నరాల సమస్యతో పాటు గ్యాస్ట్రిక్ ఇబ్బందులు వచ్చే ఛాన్స్ ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
News April 19, 2025
ఈ అలవాట్లతో మీ లివర్ రిస్క్‌లో పడ్డట్లే..

చక్కెర అధికంగా ఉన్న పదార్థాలు తీసుకోవడం వల్ల అది కొవ్వుగా మారి ఫ్యాటీ లివర్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫ్రై ఫుడ్స్ కాలేయంపై భారాన్ని పెంచుతాయి. మాంసం అధికంగా తినడం వల్ల శరీరంలో అమ్మోనియా స్థాయులు పెరుగుతాయి. పెయిన్ కిల్లర్స్, వెయిట్ లాస్ మెడిసిన్స్ వల్ల కాలేయంపై ప్రభావం పడే అవకాశముంది. లివర్ చెడిపోవడానికి ఆల్కహాల్ ప్రధాన కారణమని, కనుక ఈ అలవాటును పూర్తిగా మానుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
News April 19, 2025
ప్రభుత్వ భూమిని ‘వసంత హోమ్స్’ ఆక్రమించింది: హైడ్రా

హైదరాబాద్ హఫీజ్‌పేట్ సర్వే నంబర్ 79లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై హైడ్రా వివరణ ఇచ్చింది. ‘39.2 ఎకరాల్లో సగానికిపైగా ఆక్రమణలు జరిగాయి. అది ప్రభుత్వ నిషేధిత భూమిగా రెవెన్యూ రికార్డుల్లో ఉంది. సర్వే నం.79/1 పేరుతో ప్రభుత్వాన్ని ‘వసంత హోమ్స్’ తప్పుదోవ పట్టించింది. 19 ఎకరాలు ఆక్రమించి ఇళ్లు కట్టి అమ్మేశారు. ఖాళీగా ఉన్న మరో 20 ఎకరాల్లోనూ నిర్మాణాలు చేపట్టారు’ అని వివరించింది.