News November 26, 2024
ఢిల్లీ వెళ్లింది అందుకే: ఫడణవీస్
ఆకస్మాత్తుగా ఢిల్లీకి వెళ్లడంపై మహారాష్ట్ర బీజేపీ నేత దేవేంద్ర ఫడణవీస్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కూతురు రిసెప్షన్‌కు హాజరయ్యేందుకు వెళ్లానని, రాజకీయాల గురించి కాదని మీడియాతో చెప్పారు. మరోవైపు ఇవాళ ఆయన ముంబైలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సీఎంగా బాధ్యతలు ఎవరు చేపడుతారనే విషయమై క్లారిటీ వచ్చే అవకాశముంది.
Similar News
News December 5, 2024
ఏపీలో 53 నూతన జూనియర్ కాలేజీలకు గ్రీన్‌సిగ్నల్
AP: రాష్ట్రవ్యాప్తంగా 53 నూతన జూనియర్ కాలేజీల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఇంటర్ విద్యా మండలి కార్యదర్శి కృతికా శుక్లా పంపిన ప్రతిపాదనలకు పాఠశాల విద్యా శాఖ కార్యదర్శి కోన శశిధర్ ఆమోదం తెలిపారు. 37 మండలాల్లో 47, రెండు పట్టణ ప్రాంతాల్లో 6 కాలేజీలను ఏర్పాటుచేయనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 480 జూనియర్ కాలేజీలున్నాయి.
News December 5, 2024
‘మేకిన్ ఇండియా’పై పుతిన్ ప్రశంసలు
చిన్న, మధ్యతరహా కంపెనీలకు స్థిరమైన పరిస్థితులను భారత ప్రభుత్వం, అక్కడి నాయకత్వం సృష్టించిందని రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. PM నరేంద్రమోదీ చేపట్టిన ‘మేకిన్ ఇండియా’ బాగుందని ప్రశంసించారు. ‘రష్యా ఇంపోర్ట్ సబ్‌స్టిట్యూషన్ ప్రోగ్రామ్‌లాగే మేకిన్ ఇండియా ఉంటుంది. భారత్‌లో తయారీ ప్లాంట్లను నెలకొల్పేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. అక్కడ పెట్టుబడులు లాభయదాకమని మేం విశ్వసిస్తున్నాం’ అని అన్నారు.
News December 5, 2024
ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ట్రాన్స్‌జెండర్లు
TG: ట్రాఫిక్ అసిస్టెంట్లుగా 44 మంది ట్రాన్స్‌జెండర్లు ఎంపికయ్యారు. నిన్న హైదరాబాద్ గోషామహల్ మైదానంలో రన్నింగ్, లాంగ్ జంప్, హై జంప్, షాట్ పుట్ లాంటి ఈవెంట్స్ నిర్వహించగా 58 మందిలో 44 మంది పాస్ అయ్యారు. వీరికి త్వరలో ట్రైనింగ్ ఇవ్వనున్నారు. అనంతరం సిగ్నల్స్ వద్ద ట్రాఫిక్ మానిటరింగ్‌తో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ సేవలకు వినియోగించుకోనున్నారు. వీరికి ప్రత్యేక యూనిఫామ్, స్టైఫండ్ అందిస్తారు.