News February 11, 2025

పేదలు ధనికులవ్వంది అందుకే: జాక్ మా

image

వ్యాపారం చేయాలని ఉన్నా.. చాలా మంది ఉద్యోగాలకే మొగ్గుచూపుతారు. అలాంటి వారిపై చైనీస్ బిలియనీర్ జాక్ మా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘కోతి ముందు పండ్లు&డబ్బు పెడితే అవి పండ్లనే తీసుకుంటాయి. మనుషులు కూడా వ్యాపారానికి బదులు జాబ్‌కే జై కొడతారు. ఎందుకంటే జీతం కంటే వ్యాపారంలో ఎక్కువ డబ్బులు వస్తాయని తెలియదు. పేదలు.. పేదలుగా ఉండటానికి ఇదో కారణం’ అని చెప్పారు. గతంలో చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరలవుతున్నాయి.

Similar News

News January 21, 2026

భారత్ నుంచి వన్‌ప్లస్ ఔట్ అనే వార్తలపై క్లారిటీ

image

భారత్‌లో సేవలు నిలిపివేస్తున్నట్టు వస్తున్న వార్తలను మొబైల్ దిగ్గజం వన్‌ప్లస్ ఖండించింది. అవి ఫేక్ న్యూస్ అని, రూమర్లను నమ్మొద్దని చెప్పింది. ఇండియన్ మార్కెట్‌లో తమ సేవలు యథావిధిగా కొనసాగుతాయని తెలిపింది. 2024లో సేల్స్‌ 20% పతనం, రిటైలర్ మార్జిన్స్ తగ్గుదల, లేఆఫ్స్ కారణంగా భారత్‌లో అన్ని రకాల సేవలను వన్‌ప్లస్ నిలిపివేయనుందనే రూమర్స్ వచ్చినట్టు తెలుస్తోంది.

News January 21, 2026

HYDలో లారియల్ తొలి గ్లోబల్ బ్యూటీ టెక్ హబ్

image

ప్రపంచంలోనే అతిపెద్ద కాస్మొటిక్ కంపెనీ లారియల్(L’Oréal) HYDలో తొలి గ్లోబల్ బ్యూటీ టెక్ హబ్ ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు దావోస్ సదస్సులో మంత్రి శ్రీధర్ బాబుతో ఆ సంస్థ CEO నికోలస్ సమావేశమై చర్చించారు. నవంబర్‌లో జరిగే ప్రారంభోత్సవానికి CM రేవంత్, మంత్రి శ్రీధర్ బాబును ఆహ్వానించారు. ఆవిష్కరణలు, టెక్నాలజీ, Ai డేటాకు ఇది కేంద్రంగా పనిచేస్తుంది. భవిష్యత్తులో తయారీ కేంద్రం ఏర్పాటుకు సంస్థ ఆసక్తి చూపింది.

News January 21, 2026

మరో బ్లడ్ బాత్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు!

image

స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలు ఎదుర్కొంటున్నాయి. ఉదయం ఫ్లాట్‌గా మొదలై క్రమంగా కుప్పకూలాయి. నిఫ్టీ 25 వేల దిగువకు పడిపోయింది. 260 పాయింట్లు కోల్పోయి 24,950 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ 935 పాయింట్లు పడి 81,250 వద్ద కొనసాగుతోంది. ట్రెంట్ షేర్లు 3%, ICICI బ్యాంక్ 2.52%, BE 2.1%, L&T 1.86% నష్టపోయాయి. అటు డాలర్‌తో పోలిస్తే మన కరెన్సీ విలువ సైతం భారీగా పడిపోయింది. డాలర్‌కు రూ.91.31 వద్ద ట్రేడవుతోంది.