News June 21, 2024
ఈ వృద్ధురాలి నిర్ణయాన్ని మెచ్చుకోవాల్సిందే!

మొబైల్‌కు అతుక్కుపోతున్న ప్రజలకు పుస్తక పఠనాన్ని అలవాటు చేసేందుకు భీమాబాయి కృషి చేస్తున్నారు. MHలోని నాసిక్ వద్ద ఉన్న ‘పుస్తకాంచ్ హోటల్ రిలాక్స్ కార్నర్’ను 74 ఏళ్ల భీమాబాయి నిర్వహిస్తున్నారు. హోటల్‌కు వచ్చిన వాళ్లు ఖాళీ సమయంలో మొబైల్ చూస్తూ ఉండటాన్ని గమనించాను. దీంతో ఫుడ్ వచ్చే దాకా వాళ్లు బుక్స్ చదువుకునేలా ఏర్పాట్లు చేశాను‘ అని ఆమె చెప్పారు. ప్రస్తుతం హోటల్‌లో 5వేల పుస్తకాలున్నాయి.
Similar News
News February 15, 2026
పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్

T20WC: ICC ఈవెంట్లలో పాక్‌పై భారత్ జైత్రయాత్రను కొనసాగించింది. ఫార్మాట్ ఏదైనా, ప్లేస్ మారినా ఫలితం మారదని నిరూపించింది. కొలంబోలో జరిగిన మ్యాచ్‌లో దాయాదిని 61 పరుగుల తేడాతో చిత్తు చేసింది. 176 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన పాక్‌ను 18 ఓవర్లలో 114 రన్స్‌కే కట్టడి చేసింది. బుమ్రా, అక్షర్, వరుణ్, హార్దిక్ తలో 2 వికెట్లు, కుల్దీప్, తిలక్ చెరో వికెట్ తీశారు. వరుసగా 3 విజయాలతో IND సూపర్-8కి చేరుకుంది.
News February 15, 2026
38 దేశాలతో ట్రేడ్ డీల్స్.. MSMEల మార్కెట్ విస్తరించింది: మోదీ

దేశంలో రాజకీయ స్థిరత్వం పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని పెంచిందని PM మోదీ చెప్పారు. కొన్నేళ్లుగా 38 దేశాలతో 9 ట్రేడ్ డీల్స్ చేసుకున్నట్లు తెలిపారు. టెక్స్‌టైల్స్, లెదర్, కెమికల్స్, హ్యాండ్‌క్రాఫ్ట్స్, జువెల్లరీ వంటి రంగాల్లో MSMEల మార్కెట్ విస్తరించిందన్నారు. ఎగుమతిదారులకు కొత్త అవకాశాలు తెరుచుకున్నాయని పేర్కొన్నారు. UPA హయాంలో ఆర్థిక నిర్వహణ సరిగ్గా లేక ఏ దేశంతోనూ చర్చించలేకపోయిందని విమర్శించారు.
News February 15, 2026
శివుడు తనలో సగ భాగాన్ని పార్వతికి ఎందుకు ఇచ్చాడు?

పార్వతీదేవి శివునిపై అచంచలమైన భక్తితో కఠోర తపస్సు చేసింది. ఆమె భక్తికి మెచ్చిన శివుడు, ఆమెను తనలో భాగంగా చేసుకున్నాడు. దీనివల్ల లోకానికి పురుషుడు (శివుడు – చైతన్యం), స్త్రీ (పార్వతి – శక్తి) వేర్వేరు కాదని ఈ రెండింటి కలయికతోనే సృష్టి నడుస్తుందని నిరూపించారు. ఇద్దరూ సమానమేనని, ఒకరు లేనిదే మరొకరు సంపూర్ణులు కారని ఈ రూపం చెబుతుంది. భక్తుడు భగవంతుడిలో లీనమవ్వడాన్ని కూడా ఇది సూచిస్తుంది.


