News September 17, 2024

వైసీపీ వల్లే ఈ పరిస్థితి: చంద్రబాబు

image

AP: భవానీపురం రోడ్డు, బుడమేరులో ఊహించని వరద వచ్చిందని సీఎం చంద్రబాబు అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం అసంపూర్తిగా పనులు వదిలేయడమే ఈ పరిస్థితికి కారణమని మీడియాతో చెప్పారు. 11.43 లక్షల క్యూసెక్కుల వరద వచ్చే సమయంలో 40 మెట్రిక్ టన్నుల బరువున్న 3 బోట్లు బ్యారేజీ గేట్ కౌంటర్ వెయిట్‌ను ఢీకొట్టాయని చెప్పారు. ఇప్పటికీ వాటిని తీసేందుకు కష్టపడుతున్నట్లు తెలిపారు. ఆ ప్రభుత్వమే ఉంటే ఇంకా కోలుకునే వాళ్లం కాదన్నారు.

Similar News

News October 5, 2024

ఆరోజున ప్రభాస్ సినిమా అప్‌డేట్స్ వెల్లువ?

image

ఈ నెల 23న ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా ఆయన ఫ్యాన్స్‌కు అప్‌డేట్స్ వెల్లువెత్తే అవకాశం కనిపిస్తోంది. టాలీవుడ్ సమాచారం ప్రకారం.. రాజాసాబ్ నుంచి టీజర్, హను రాఘవపూడి చిత్రానికి సంబంధించిన టైటిల్ రివీల్, కల్కి-2 నుంచి అప్‌డేట్, సందీప్ వంగా ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ రిలీజయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అటు డార్లింగ్, ఈశ్వర్ మూవీస్ రీ-రిలీజ్ ఉండటంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నామంటున్నారు రెబల్ ఫ్యాన్స్‌.

News October 5, 2024

మూసీ నిర్వాసితుల కోసం ప్రత్యేక కమిటీ

image

TG: మూసీ నిర్వాసితుల జీవనోపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. సెర్ప్ సీఈవో ఛైర్మన్‌గా 14 మంది సభ్యులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. అటు మూసీ నిర్వాసితులకు ఇప్పటికే డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.

News October 5, 2024

జెర్రి పడిందన్నది అవాస్తవం.. నమ్మొద్దు: TTD

image

తిరుమల అన్నప్రసాదంలో జెర్రి కనిపించిందంటూ వస్తున్న ఆరోపణల్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఖండించింది. అవి అవాస్తవాలని తేల్చిచెప్పింది. ‘వేలాదిమందికి వడ్డించేందుకు ప్రసాదాన్ని తయారుచేస్తారు. అంత వేడిలో ఓ జెర్రి ఏమాత్రం చెక్కు చెదరకుండా ఉందనడం ఆశ్చర్యకరం. ఇది కావాలని చేసిన చర్యగా భావించాల్సి వస్తోంది. దయచేసి భక్తులు ఇలాంటి వార్తల్ని నమ్మొద్దని టీడీపీ విజ్ఞప్తి చేస్తోంది’ అని ఓ ప్రకటనలో కోరింది.