News March 30, 2024
‘ఈ సారి SRH కప్పు కొడుతుంది మావా..’
IPL: ఈ ఏడాది సన్‌రైజర్స్ హైదరాబాద్ చాలా బలంగా ఉందని ఫ్యాన్స్ అంటున్నారు. 5 సార్లు టైటిల్ సాధించిన ముంబైపై భారీ స్కోర్ సాధించిందని గుర్తు చేస్తున్నారు. వరల్డ్ కప్ హీరోలు కమిన్స్, హెడ్‌తో పాటు ప్రస్తుతం వరల్డ్ బెస్ట్ టీ20 బ్యాటర్ క్లాసెన్ జట్టులో ఉన్నారని చెబుతున్నారు. దేశీయ ఆటగాడు అభిషేక్ శర్మ కూడా రాణిస్తున్నారని.. బౌలింగ్ కాస్త మెరుగు పడితే తిరుగుండదని కామెంట్స్ చేస్తున్నారు.
Similar News
News November 7, 2024
ఈనెల 18-26 మధ్య జిల్లాల్లో BC కమిషన్ పర్యటన
TG: రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన BC కమిషన్ జిల్లాల్లో పర్యటించనుంది. ఈ నెల 18 నుంచి 26 వరకు ఈ పర్యటన ఉంటుంది. హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్‌లో పర్యటించనుంది. ఇప్పటికే ఆదిలాబాద్, నిజామాబాద్, సంగారెడ్డి, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో పర్యటించింది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ప్రత్యేక కమిషన్‌తో సమాచారం పంచుకోనుంది.
News November 7, 2024
మోదీని ప్రపంచమంతా ప్రేమిస్తోంది: ట్రంప్
అమెరికా అధ్యక్షుడిగా గెలుపొందిన డొనాల్డ్ ట్రంప్‌నకు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. మరోసారి ఇద్దరం కలిసి పనిచేద్దామని, ఇరు దేశాల ద్వైపాక్షిక బంధాన్ని మరింత పటిష్ఠం చేసుకునే దిశగా చర్యలు తీసుకుందామని పిలుపునిచ్చారు. ప్రపంచశాంతికి కృషి చేద్దామన్నారు. ప్రపంచం మొత్తం మోదీని ప్రేమిస్తోందని.. భారత్ అద్భుత దేశమని ట్రంప్ కొనియాడారు. భారత్, మోదీని నిజమైన స్నేహితులుగా భావిస్తానని ఆయన తెలిపారు.
News November 7, 2024
ట్రంప్‌నకు అభినందనలు.. హసీనాను పీఎంగా పేర్కొన్న అవామీ లీగ్
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌నకు అభినందనలు తెలుపుతూ షేక్ హసీనా పేరుతో అవామీ లీగ్ రాసిన లేఖ చర్చనీయాంశంగా మారింది. ఇందులో హసీనాను బంగ్లాదేశ్ ప్రధానిగా ప్రస్తావించడమే దీనికి కారణం. రిజర్వేషన్లపై నిరసనలతో హసీనా బంగ్లాదేశ్ విడిచి భారత్‌కు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బంగ్లాలో మధ్యంతర ప్రభుత్వం ఏర్పడగా మహమ్మద్ యూనస్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు.