News March 30, 2024

‘ఈ సారి SRH కప్పు కొడుతుంది మావా..’

image

IPL: ఈ ఏడాది సన్‌రైజర్స్ హైదరాబాద్ చాలా బలంగా ఉందని ఫ్యాన్స్ అంటున్నారు. 5 సార్లు టైటిల్ సాధించిన ముంబైపై భారీ స్కోర్ సాధించిందని గుర్తు చేస్తున్నారు. వరల్డ్ కప్ హీరోలు కమిన్స్, హెడ్‌తో పాటు ప్రస్తుతం వరల్డ్ బెస్ట్ టీ20 బ్యాటర్ క్లాసెన్ జట్టులో ఉన్నారని చెబుతున్నారు. దేశీయ ఆటగాడు అభిషేక్ శర్మ కూడా రాణిస్తున్నారని.. బౌలింగ్ కాస్త మెరుగు పడితే తిరుగుండదని కామెంట్స్ చేస్తున్నారు.

Similar News

News March 7, 2026

సివిల్స్‌లో సత్తా చాటిన వైభవ్ మేనమామ

image

టాలెంటెడ్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ మేనమామ అభిషేక్ సివిల్స్ ఫలితాల్లో సత్తా చాటారు. తొలి ప్రయత్నంలోనే 102వ ర్యాంకు సాధించారు. దీంతో అల్లుడు క్రికెట్‌లో, మామ సివిల్స్‌లో అదరగొట్టారని పలువురు ప్రశంసిస్తున్నారు. 27 ఏళ్ల అభిషేక్ స్వస్థలం బిహార్‌లోని రాజజన్ గ్రామం. ఎంటెక్‌లో గోల్డ్ మెడల్ సాధించిన అతను 2022 నుంచి సివిల్స్‌కు సిద్ధమవుతున్నారు. అభిషేక్ తండ్రి అభయ్ నలంద ఓపెన్ వర్సిటీ రిజిస్ట్రార్‌.

News March 7, 2026

జాగ్రత్త.. రేపు అన్ని జిల్లాల్లో 36°C-40°C

image

TG: రాబోయే రెండు రోజులు రాష్ట్రంలో సాధారణం కంటే 3°C-4°C డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరగనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. అన్ని జిల్లాల్లో 36°C-40°C ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఆస్కారముందని పేర్కొంది. ఈ మేరకు అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇవాళ భద్రాచలం, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో 38°C-40°C మధ్య టెంపరేచర్ నమోదైందని తెలిపింది.

News March 7, 2026

ఈ నెలాఖరులోగా లక్ష గృహ ప్రవేశాలు: పొంగులేటి

image

TG: ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద గ్రామాల్లో 3.60L ఇళ్లను మంజూరు చేశామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. వీటిలో లక్ష యూనిట్లకు ఈ నెల 31లోగా గృహ ప్రవేశాలు చేయించాలని అధికారులను ఆదేశించారు. లబ్ధిదారులకు నగదు చెల్లింపులను నిలిపేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. డబుల్ బెడ్రూం ఇళ్లకూ అర్హుల ఎంపికను ఈ నెలాఖరులోపు పూర్తిచేయాలన్నారు. APRలో రెండో దశ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని ప్రకటించారు.