News January 4, 2025
ఆరోజులు మళ్లీరావు.. 5L పెట్రోల్ ధర రూ.3.60!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1735995380042_746-normal-WIFI.webp)
ఏళ్ల క్రితంనాటి మధుర జ్ఞాపకాలను సోషల్ మీడియా గుర్తుచేస్తుంటుంది. అలాగే, 1963లో ఐదు లీటర్ల పెట్రోల్‌ను కేవలం రూ.3.60కే విక్రయించిన ఓ బిల్లు తాజాగా ప్రత్యక్షమైంది. ఇప్పుడు రూ.100+గా ఉన్న లీటర్ పెట్రోల్ ధర.. ఒకప్పుడు రూపాయి కంటే తక్కువగా ఉండటం చూసి గోల్డెన్ డేస్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆ రోజులూ.. మళ్లీరావు అంటూ సాంగ్స్ పాడుకుంటున్నారు. దీనిపై మీ కామెంట్?
Similar News
News January 14, 2025
మా వాళ్లను విడుదల చేయండి.. రష్యాను కోరిన భారత్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1736858488254_1124-normal-WIFI.webp)
రష్యా సైన్యంలో పనిచేస్తున్న తమ పౌరుల విడుదలను వేగవంతం చేయాలని భారత్ మరోసారి కోరింది. కేరళకు చెందిన ఓ యువకుడు ఇటీవల యుద్ధంలో మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. ఈ ఘటన దురదృష్టకరమని భారత్ పేర్కొంది. కేరళ యువకుడి మృతదేహాన్ని తరలించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టు ఎంబసీ తెలిపింది. భారతీయుల తరలింపునకు రష్యా ప్రభుత్వ వర్గాలతో చర్చిస్తున్నట్టు వెల్లడించింది.
News January 14, 2025
అయ్యప్పకు తిరువాభరణాలు అలంకరించి..
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1736861175422_653-normal-WIFI.webp)
శబరిమల కొండల్లో మకరజ్యోతి సాక్షాత్కారమైంది. అంతకుముందు పందళ రాజవంశీయులు తిరువాభరణాలతో సన్నిధానానికి చేరుకొని మణికంఠుడికి సమర్పించారు. పూజారులు వాటిని అయ్యప్పకు అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత స్వామి సన్నిధి తలుపులు తెరుచుకోగానే మరోవైపు మకరజ్యోతి దర్శనమిచ్చింది. దీంతో భక్తులంతా జ్యోతిని దర్శించుకొని పులకించిపోయారు.
News January 14, 2025
యూజీసీ నెట్ కొత్త తేదీలివే..
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1736860424852_653-normal-WIFI.webp)
రేపు జరగాల్సిన యూజీసీ నెట్-2025 పరీక్షను <<15149513>>వాయిదా<<>> వేసిన NTA తాజాగా రీషెడ్యూల్ తేదీలను ప్రకటించింది. ఈనెల 21న ఉదయం, 27న మధ్యాహ్నం సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. కాగా సంక్రాంతి సందర్భంగా 15న జరగాల్సిన పరీక్షను వాయిదా వేస్తూ నిన్న NTA ప్రకటన చేసిన విషయం తెలిసిందే.