News April 5, 2024

ఆ మరణాలు ప్రభుత్వ హత్యలే: చంద్రబాబు

image

AP: రాష్ట్రంలో పెన్షనర్ల మరణాలు ప్రభుత్వ హత్యలేనని టీడీపీ చీఫ్ చంద్రబాబు ఆరోపించారు. హత్యలు చేసిన సీఎం జగన్‌కు అధికారంలో కొనసాగే నైతిక హక్కు లేదని చెప్పారు. తూగో జిల్లా నల్లజర్లలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం పదవి నుంచి జగన్ తక్షణమే తప్పుకోవాలని డిమాండ్ చేశారు. పింఛన్ల విషయంలో వైసీపీ కుట్ర ప్రజలకు అర్థమైందన్నారు.

Similar News

News January 21, 2025

RTCకి సంక్రాంతి ఆదాయం రూ.115కోట్లు!

image

TG: సంక్రాంతి సందర్భంగా నడిపిన స్పెషల్ బస్సుల ద్వారా ఆర్టీసీకి కాసుల వర్షం కురిసినట్లు సమాచారం. 6వేల ప్రత్యేక బస్సుల ద్వారా అనధికార లెక్కల ప్రకారం రూ.115 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. గతేడాది 5వేల బస్సులు నడపగా, రూ.99కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పారు. ఈ నెల 10-12, 19,20 తేదీల్లో TGSRTC బస్సుల్లో 50శాతం వరకు ఛార్జీలు పెంచిన విషయం తెలిసిందే. రెండ్రోజుల్లో అధికారిక లెక్కలు వెలువడనున్నాయి.

News January 21, 2025

నేటి నుంచి దరఖాస్తులకు మరో అవకాశం

image

TG: రైతుభరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు నేటి నుంచి ప్రభుత్వం మరోసారి దరఖాస్తులను స్వీకరిస్తోంది. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇప్పటికే అర్హుల జాబితా ఆయా గ్రామాలకు చేరింది. తమ పేర్లు రాలేదని కొందరు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో వారికి అవకాశమివ్వాలని సర్కారు నిర్ణయించింది. అలాంటివారి నుంచి గ్రామసభల్లో దరఖాస్తులు స్వీకరించాలని అధికారులను ఆదేశించింది.

News January 21, 2025

మరో వారం కనిష్ఠ ఉష్ణోగ్రతలు

image

TG: బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతోంది. మరో వారంపాటు కనిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, రంగారెడ్డి తదితర జిల్లాల్లో సింగిల్ డిజిట్‌కే ఉష్ణోగ్రతలు పడిపోయాయి. గద్వాల జిల్లా మినహా అన్ని జిల్లాల్లో టెంపరేచర్ 15°C కంటే తక్కువగా నమోదవుతుండటంతో ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది.