News April 3, 2024
ఎన్నికల విధుల నుంచి ఆ ఉద్యోగులకు మినహాయింపు

TG: సార్వత్రిక ఎన్నికల విధుల నుంచి సీనియర్ ఉద్యోగులకు ఈసీ మినహాయింపు ఇచ్చింది. 6 నెలల్లో రిటైర్ అయ్యే ఉద్యోగులకు ఎన్నికల విధుల నుంచి మినహాయింపు ఉంటుందని పేర్కొంటూ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు.
Similar News
News April 25, 2025
ఈ వారంలోనే TG టెన్త్ ఫలితాలు!

TG: టెన్త్ ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది. నాలుగైదు రోజుల్లోనే రిజల్ట్స్‌ను విద్యాశాఖ ప్రకటించనున్నట్లు సమాచారం. విడుదల తేదీని ఖరారు చేయాలని కోరుతూ పరీక్షల విభాగం ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలుస్తోంది. CM రేవంత్ ఆమోదం లభించగానే ఫలితాలను రిలీజ్ చేస్తారు. మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగిన పబ్లిక్ పరీక్షలకు 5 లక్షల మందికి పైగా హాజరయ్యారు.
News April 25, 2025
ఆమె చదువు అమూల్యం.. అతని సాయం చిరస్మరణీయం

AP: పల్నాడు జిల్లా నాదెండ్ల మండలంలోని జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని అమూల్యకు టెన్త్‌లో 593 మార్కులు వచ్చాయి. పేద కుటుంబం నుంచి వచ్చిన ఆ చదువుల తల్లిని కలెక్టర్ అరుణ్‌బాబు సత్కరించారు. ఆమె పేరెంట్స్ అనిల్, రూతమ్మ కూలి పనులకు వెళ్తేనే పూట గడుస్తుందని తెలుసుకుని ఆయన చలించిపోయారు. వెంటనే ఒక ఎకరం పొలం మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
News April 25, 2025
నేడు పహల్గామ్‌కు రాహుల్ గాంధీ

లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ నేడు జమ్మూకశ్మీర్‌కు వెళ్లనున్నారు. ఉగ్రదాడి జరిగిన పహల్గామ్ ప్రాంతాన్ని ఆయన పరిశీలించనున్నారు. ముష్కరుల దాడి సమయంలో అమెరికాలో ఉన్న రాహుల్ ఆ పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసి భారత్‌కు వచ్చారు. కాగా నిన్న జరిగిన అఖిల పక్ష సమావేశంలో ఉగ్రదాడి ఘటనపై ప్రభుత్వానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన సంగతి తెలిసిందే.