News May 11, 2024

బయటి ప్రాంతాల వారు నియోజకవర్గాల నుంచి వెళ్లిపోవాలి: సీఈవో ముకేశ్

image

AP: సా.6 గంటల తర్వాత అన్నిరకాల ప్రచారం ఆగిపోవాల్సిందేనని CEO ముకేశ్ కుమార్ మీనా స్పష్టం చేశారు. బయటి ప్రాంతాల వారు నియోజకవర్గాల నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు. పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాల్లో మాత్రం మినహాయింపు ఉంటుందని చెప్పారు. రేపు సాయంత్రానికి సిబ్బంది పోలింగ్ బూత్‌లకు చేరుకుంటారని తెలిపారు. ఎల్లుండి ఉ.7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమవుతుందని చెప్పారు.

Similar News

News December 3, 2025

మెదక్: అత్తమామల వేధింపులు.. తల్లీకొడుకు బలి

image

చిన్నశంకరంపేట మం. ఖాజాపూర్‌లో అత్తమామల వేధింపులకు <<18446685 >>తల్లి, కొడుకు<<>> బలయ్యారు. గ్రామానికి చెందిన తాళ్ల ప్రవీణ్ గౌడ్‌కు నార్సింగి మం. సంకాపూర్‌కు చెందిన అఖల(23)తో నాలుగేళ్ల క్రితం పెళ్లి కాగా రియాన్స్(2) సంతానం. భర్త ప్రవీణ్ ఆరు నెలల క్రితం అనుమానాస్పదంగా మృతిచెందాడు. అప్పటి నుంచి మనుమడిని వదిలి పుట్టింటికి వెళ్లిపోవాలని అత్తమామలు వేధిస్తున్నారు. దీంతో నిన్న కొడుకుకు ఊపిరాడకుండా చేసి అఖిల ఉరేసుకుంది.

News December 3, 2025

ప్రెగ్నెన్సీ ఫస్ట్ ట్రైమిస్టర్‌లో ఈ జాగ్రత్తలు తీసుకోండి

image

ఆరు నుంచి 12 వారాల్లో బిడ్డ అవయవాలన్నీ ఏర్పడుతాయి. ఈ సమయంలో వైద్యుల సలహా లేకుండా ఎలాంటి మందులు వాడకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఎక్స్‌రేలకు దూరంగా ఉండాలి. ఏ సమస్య అనిపించినా వైద్యులను సంప్రదించాలి. జ్వరం వచ్చినా, స్పాంటింగ్ కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించాలి. జన్యుపరమైన సమస్యలుంటే తప్ప అబార్షన్‌ కాదు. కాబట్టి అన్ని పనులు చేసుకోవచ్చు. బరువులు ఎత్తడం, పరిగెత్తడం మానేయాలని సూచిస్తున్నారు.

News December 3, 2025

ఈ గుళ్లలో పానీపూరీనే ప్రసాదం..

image

ఏ గుడికి వెళ్లినా లడ్డూ, పులిహోరాలనే ప్రసాదాలుగా ఇస్తారు. కానీ గుజరాత్‌లోని రపుతానా(V)లో జీవికా మాతాజీ, తమిళనాడులోని పడప్పాయ్‌ దుర్గా పీఠం ఆలయాల్లో మాత్రం పిజ్జా, బర్గర్, పానీపురి, కూల్ డ్రింక్స్‌ను ప్రసాదంగా పంచుతారు. దేవతలకు కూడా వీటినే నైవేద్యంగా సమర్పిస్తారు. భక్తులు ప్రస్తుత కాలంలో ఇష్టపడే ఆహారాన్ని దేవతలకు నివేదించి, వారికి సంతోషాన్ని పంచాలనే విభిన్న సంప్రదాయాన్ని అనుసరిస్తున్నారు.