News July 16, 2024

ఆ మార్గదర్శకాలే రైతులకు ఉరితాళ్లు: ఈటల

image

TG: రైతు రుణమాఫీ కోసం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలను BJP MP ఈటల రాజేందర్ తప్పుబట్టారు. ఆ మార్గదర్శకాలు రైతులకు ఉరితాళ్లని అభివర్ణించారు. ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందని ఆయన గుర్తు చేశారు. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని, మోసం చేసేవాళ్లకు ప్రజలు బుద్ధి చెబుతారని ఈటల అభిప్రాయపడ్డారు. తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలను ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు.

Similar News

News January 21, 2025

పిల్లి చేసిన పనికి ఉద్యోగం పోయిందిగా..!

image

ఏంటి షాక్ అయ్యారా? చైనాకు చెందిన ఓ యువతికి ఇలాంటి విచిత్రమైన సంఘటనే ఎదురైంది. ఆ యువతి తన రాజీనామా లేఖను డ్రాఫ్ట్‌లో ఉంచింది. అయితే, ల్యాప్‌టాప్‌ను వదిలేసి వెళ్లగా అనుకోకుండా పెంపుడు పిల్లి కీబోర్డ్‌ ఎంటర్ బటన్ మీద దూకింది. దీంతో ఆ మెయిల్ యువతి బాస్‌కు చేరడంతో ఉద్యోగంతో పాటు ఇయర్ ఎండ్ బోనస్‌ను కోల్పోయింది. ఇదంతా సీసీటీవీలో రికార్డవగా, ఆమె తన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది.

News January 21, 2025

నీరజ్ చోప్రాకు కట్నం ఎంత ఇచ్చారంటే..?

image

ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా ఇటీవల టెన్నిస్ ప్లేయర్ హిమానీ మోర్‌ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కట్నంగా తన అత్తమామల నుంచి నీరజ్ ఒక్క రూపాయి మాత్రమే తీసుకున్నారు. అలాగే ఎలాంటి ఖరీదైన బహుమతులు, వస్తువులు, దుస్తులు కూడా ఆయన స్వీకరించలేదని హిమానీ తల్లిదండ్రులు తెలిపారు. దేవుడి దయ వల్ల తమ అమ్మాయికి దేశం మొత్తాన్ని గర్వింపజేసిన వ్యక్తితో పెళ్లి కావడం సంతోషంగా ఉందన్నారు.

News January 21, 2025

సీఎం దావోస్ పర్యటన.. తొలి ఒప్పందం

image

TG: సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో తొలి ఒప్పందం కుదిరింది. వినియోగ వస్తువుల తయారీలో పేరొందిన బ్రాండ్లలో ఒకటైన యూనిలీవర్ తెలంగాణలో పెట్టుబడులకు సంసిద్ధత వ్యక్తం చేసింది. బాటిల్ క్యాప్‌ల తయారీ యూనిట్, కామారెడ్డి జిల్లాలో పామాయిల్ తయారీ యూనిట్ ఏర్పాటు చేసేందుకు ఓకే చెప్పింది.