News October 8, 2024

బఫర్ జోన్‌లో ఉన్నవి కూల్చడం లేదు: భట్టి

image

TG: మూసీ సుందరీకరణలో భాగంగా నదీ గర్భంలోని నిర్మాణాలనే తొలగిస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. బఫర్ జోన్‌లో ఉన్న నిర్మాణాల జోలికి వెళ్లడం లేదని స్పష్టం చేశారు. మూసీ పరిరక్షణ, చెరువుల ఆక్రమణలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌లో ఆయన మాట్లాడారు. గత పదేళ్లలో పూర్తిగా 44, పాక్షికంగా 127 చెరువులు కబ్జాకు గురైనట్లు వెల్లడించారు. మూసీ ప్రక్షాళనకు రూ.1.50లక్షల కోట్లు అనే వార్తలను ఆయన కొట్టిపారేశారు.

Similar News

News November 7, 2024

రోహిత్‌ కెప్టెన్సీ కొనసాగించాల్సిందే: ఫించ్

image

భారత కెప్టెన్ రోహిత్ శర్మ బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో తొలి మ్యాచ్‌కు అందుబాటులో ఉండని నేపథ్యంలో ఆ సిరీస్ అంతటికీ కొత్త కెప్టెన్‌ను నియమించాలని గవాస్కర్ ఇటీవల పేర్కొన్నారు. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఫించ్ ఆ వ్యాఖ్యల్ని తప్పుబట్టారు. ‘రోహిత్ భారత్‌కి కెప్టెన్. బిడ్డ పుట్టే సందర్భాన్ని ఎంజాయ్ చేసే హక్కు అతడికి కచ్చితంగా ఉంటుంది. తిరిగి వచ్చాక అతడే మళ్లీ కెప్టెన్‌గా ఉండాలి’ అని స్పష్టం చేశారు.

News November 7, 2024

ఆ దేశంలో బిచ్చగాళ్లే ఉండరు!

image

మన పొరుగు దేశం భూటాన్‌లో నిలువ నీడ లేనివారు, బిచ్చగాళ్లు ఏమాత్రం కనిపించరు. ప్రపంచంలోని అత్యంత సంతోషకరమైన దేశాల జాబితాలో క్రమం తప్పకుండా చోటు సంపాదించే అక్కడ ప్రజల అవసరాల్ని ప్రభుత్వమే చూసుకుంటుంది. వారికి నివాసం, భూమి, ఆహార భద్రత వంటివన్నీ చూసుకుంటుంది. దీంతో ఇతర దేశాల్లో కనిపించే సహజమైన సమస్యలు ఇక్కడ కనిపించవు. అన్నట్లు ఇక్కడ వైద్య చికిత్స ఉచితం కావడం విశేషం.

News November 7, 2024

PHOTOS: కన్నీళ్లు పెట్టుకున్న కమల మద్దతుదారులు

image

అమెరికా ఎన్నికల్లో కమలా హారిస్ తీవ్రంగా పోరాడినా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించలేకపోయారు. కౌంటింగ్ సందర్భంగా ఆమె ఏ దశలోనూ ట్రంప్‌ను అందుకోలేపోయారు. ఫలితాల సరళిని బట్టి కమల ఓటమి లాంఛనం కావడాన్ని మద్దతుదారులు జీర్ణించుకోలేకపోయారు. అదే సమయంలో తీవ్ర భావోద్వేగానికి లోనై కన్నీటిపర్యంతం అయ్యారు. అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.