News March 2, 2025
యానిమల్‌లో ఆ సీన్లు వేరేలా ప్లాన్ చేశా: సందీప్ వంగా

‘యానిమల్’ సినిమాలో రణ్‌బీర్ కపూర్ నగ్నంగా నటించిన సీన్లు అప్పట్లో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ముందుగా ఈ సన్నివేశంలో ప్రోస్తెటిక్ మేకప్ వాడుదామని టెస్ట్ షూట్ కూడా చేసినట్లు దర్శకుడు సందీప్ వంగా తెలిపారు. అయితే వాస్తవికతకు దూరంగా ఉండటంతో ఔట్ ఆఫ్ ఫోకస్ టెక్నిక్ యూజ్ చేశామని చెప్పారు. కరోనా సమయంలో ఈ కథను రాసుకున్నానని, షర్ట్ కలర్‌తో సహా స్క్రిప్ట్‌లో మెన్షన్ చేసినట్లు వెల్లడించారు.
Similar News
News March 20, 2025
6 నెలల్లోపు పెట్రోల్ వాహనాల ధరకే EVలు: నితిన్ గడ్కరీ

వచ్చే 6 నెలల్లోపు EVల ధర పెట్రోల్ వాహనాలకు సమానం అవుతుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. దేశాన్ని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు మౌలిక సదుపాయాల రంగాన్ని మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నారు. మంచి రహదారులను నిర్మించడం ద్వారా వస్తువుల రవాణా ఖర్చును తగ్గించవచ్చని పేర్కొన్నారు. స్మార్ట్ సిటీల నిర్మాణంతో పాటు స్మార్ట్ ట్రాన్స్‌పోర్ట్ వ్యవస్థ ఏర్పాటుకు కేంద్రం కట్టుబడి ఉందని తెలిపారు.
News March 20, 2025
మార్చి 20: చరిత్రలో ఈరోజు

*1351: మహ్మద్ బిన్ తుగ్లక్ మరణం
*1951: భారత్ మాజీ క్రికెటర్ మదన్ లాల్ జననం
*1980: టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ జననం
*1986: హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ జననం
*2008: సినీ నటుడు శోభన్ బాబు మరణం
* అంతర్జాతీయ సంతోష దినోత్సవం
* ప్రపంచ పిచ్చుకల దినోత్సవం
News March 20, 2025
ఈ రోజు నమాజ్ వేళలు

మార్చి 20, గురువారం ఫజర్: తెల్లవారుజామున 5.08 గంటలకు సూర్యోదయం: ఉదయం 6.20 గంటలకు దుహర్: మధ్యాహ్నం 12.24 గంటలకు అసర్: సాయంత్రం 4.45 గంటలకు మఘ్రిబ్: సాయంత్రం 6.27 గంటలకు ఇష: రాత్రి 7.39 గంటలకు NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.