News November 30, 2024

రెండో టెస్టులో ఆ ముగ్గురిపై వేటు పడొచ్చు: గవాస్కర్

image

డిసెంబర్ 6 నుంచి ఆస్ట్రేలియాతో జరిగే రెండో టెస్టులో రోహిత్ శర్మ, గిల్, రవీంద్ర జడేజా ఎంట్రీ ఖాయమని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. ఓపెనర్లుగా రోహిత్, జైస్వాల్, ఫస్ట్ డౌన్‌లో గిల్ బ్యాటింగ్ చేస్తారన్నారు. పడిక్కల్, జురెల్, వాషింగ్టన్ సుందర్ బెంచ్‌కు పరిమితమయ్యే అవకాశం ఉందని చెప్పారు. తొలి టెస్టులో 295 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.

Similar News

News April 20, 2026

నేడు ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన

image

TG: నేడు మధ్యాహ్నం నుంచి రాత్రి లోపు పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు దంచికొట్టే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, యాదాద్రి, మేడ్చల్, జనగామ, సిరిసిల్ల, కామారెడ్డి, నాగర్ కర్నూల్, గద్వాల, వనపర్తి, ములుగు, భద్రాద్రి, మహబూబాబాద్ జిల్లాల్లో వానలు పడతాయని చెప్పారు. కాగా నిన్న హైదరాబాద్‌లోని పలు చోట్ల భారీ వర్షం కురిసింది.

News April 20, 2026

డెంగీ తొలి వ్యాక్సిన్‌కు గ్రీన్ సిగ్నల్

image

దేశంలోని తొలి డెంగీ వ్యాక్సిన్‌కు డీసీజీఐ నిపుణుల కమిటీ ఆమోదం తెలిపింది. ఈ క్యూడెంగా (TAK-003) వ్యాక్సిన్‌ను టకేడా ఫార్మాసూటికల్ కంపెనీ (జపాన్) అభివృద్ధి చేసింది. 4-60ఏళ్ల మధ్య వారు మూడు నెలల వ్యవధిలో రెండు డోసులలో ఈ వ్యాక్సిన్ తీసుకోవాలి. ఇది నాలుగు రకాల డెంగీ సిరోటైప్‌ల నుంచి రక్షణ కల్పిస్తుంది. ఈ ఏడాదిలోనే ఇది అందుబాటులోకి రావొచ్చు. HYDకు చెందిన బయో-ఈ సంస్థతో టకేడా భాగస్వామ్యం కుదుర్చుకుంది.

News April 20, 2026

విజయ్ విడాకుల కేసు.. నేడే విచారణ

image

TVK అధినేత విజయ్-సంగీత విడాకుల కేసు నేడు చెంగల్పట్టు కోర్టులో విచారణకు రానుంది. విచారణకు హాజరుకావాలని ఇప్పటికే విజయ్‌కు కోర్టు నోటీసులిచ్చింది. కాగా విజయ్, సంగీత పరస్పర ఆమోదంతో విడిపోయేందుకు శనివారం లాయర్లతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. సెటిల్‌మెంట్ కింద రూ.250 కోట్లు ఇవ్వాలని సంగీత కోరగా రూ.35 కోట్లు ఇచ్చేందుకు విజయ్ ఓకే చెప్పినట్లు సమాచారం.