News September 3, 2024

పుజారా, రహానె ప్లేస్‌లో ఆ ఇద్దరిని ఆడించాలి: DK

image

ఆస్ట్రేలియాతో నవంబర్ 22 నుంచి జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి గిల్, సర్ఫరాజ్‌ను ఎంపిక చేయాలని మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ అన్నారు. సీనియర్లు పుజారా, రహానె స్థానంలో వీరిద్దరూ ఆడితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌లో వీరు రాణించారని గుర్తుచేశారు. సీనియర్ల ప్లేస్‌ను భర్తీ చేయడం కష్టమని, కానీ యంగ్ ప్లేయర్లకు ఛాన్స్ ఇస్తే వారు ఫ్యూచర్‌లో మెరుగ్గా ఆడగలుగుతారని పేర్కొన్నారు.

Similar News

News February 2, 2025

ఇండియాకు WC అందించిన గొంగడి త్రిష

image

అండర్-19 ఉమెన్స్ WCలో 19 ఏళ్ల తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష సంచలనం సృష్టించారు. 7 మ్యాచుల్లో 309 రన్స్ చేసి భారత్ ప్రపంచకప్ గెలవడంలో కీలకపాత్ర పోషించారు. ఇందులో ఒక సెంచరీ కూడా ఉంది. యావరేజ్ 77, స్ట్రైక్ రేట్ 144గా ఉండటం విశేషం. ఈ WCలో అత్యధిక రన్స్ త్రిషవే. బౌలింగ్‌లోనూ సత్తా చాటి 7 వికెట్లు తీశారు. భద్రాచలంకు చెందిన త్రిష ఈ WCలో ఓపెనర్‌గా వచ్చి 4, 27, 49, 40, 110, 44 రన్స్ చేశారు.

News February 2, 2025

పోలవరం ఎత్తు తగ్గింపుతో తీవ్ర నష్టం: బొత్స

image

AP: 16 మంది ఎంపీలు ఉన్నా కేంద్రం నుంచి నిధులు సాధించడంలో టీడీపీ విఫలమైందని వైసీపీ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విమర్శించారు. బడ్జెట్లో ఏపీ అభివృద్ధికి కనీస కేటాయింపుల్లేవని అన్నారు. బిహార్ లబ్ధి పొందింది కానీ ఏపీకి ప్రాధాన్యత దక్కలేదని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తును 45.72 మీటర్ల నుంచి 41.5 మీటర్లకు కుదించారని, దీని వల్ల ఉత్తరాంధ్రకు తీవ్ర నష్టం జరుగుతుందని పేర్కొన్నారు.

News February 2, 2025

ఆ డైరెక్టర్‌తో సమంత డేటింగ్..?

image

దర్శకుడు రాజ్ నిడిమోరుతో నటి సమంత ప్రేమలో ఉన్నారంటూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. పికిల్‌బాల్ టోర్నమెంట్‌‌లో చెన్నై జట్టుకు యజమానిగా ఉన్న సమంత ఆ టోర్నీ ఆరంభోత్సవంలో రాజ్‌తో కలిసి సందడి చేశారు. ఈక్రమంలో ఆయన చేతిని సామ్ పట్టుకున్న ఫొటోలు బయటికొచ్చాయి. దీంతో వీరిద్దరి మధ్యా ఏదో నడుస్తోందంటూ వార్తలు వెల్లువెత్తాయి. ఫ్యామిలీ మ్యాన్-2, సిటాడెల్: హనీ బన్నీలో సమంత, రాజ్ కలిసి పనిచేశారు.