News May 4, 2024
జగన్‌పై దాడి చేసిన వారికి టీడీపీతో లింక్ ఉంది: YS భారతి
సీఎం జగన్‌పై దాడి చేసిన నిందితులకు టీడీపీతో సంబంధాలున్నాయని ఆయన సతీమణి వైఎస్ భారతి ఆరోపించారు. ‘రాళ్లతో కొట్టండి అని నాయకులే ప్రేరేపిస్తున్నారు. జగన్ కంటికి దెబ్బ తగిలింది అని తెలియగానే చాలా భయమేసింది. 5 నిమిషాల తర్వాత కంటికి కాదని ఫొటో పంపారు. కంటికో, కణతకో తగిలి ఉంటే పరిస్థితి ఏంటి? గతంలో కత్తితో దాడి చేసిన వ్యక్తికి కూడా టీడీపీతో లింక్ ఉంది. అప్పుడు, ఇప్పుడు కావాలనే దాడి చేశారు’ అని తెలిపారు.
Similar News
News November 4, 2024
రాష్ట్రంలో పెరిగిన భూగర్భ జలమట్టం
TG: ఈసారి కురిసిన భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో భూగర్భ జలాలు పెరిగాయి. మేలో భూగర్భ జలమట్టం సగటున 10.36 మీటర్లు ఉండగా, అక్టోబర్‌లో అది 5.38 మీటర్లకు చేరింది. వికారాబాద్ జిల్లాలో అత్యధికంగా 8.69 మీటర్లు, ఆదిలాబాద్ 7.66 మీ. భూపాలపల్లిలో 7.35 మీ. మహబూబ్‌నగర్‌లో 6.94 మీ. మేర జలమట్టం పెరిగింది. యాదాద్రి-భువనగిరి జిల్లాలో అత్యల్పంగా 2.64 మీటర్ల మట్టం పెరిగింది.
News November 4, 2024
హీరోయిన్‌ను కూడా హీరోలే డిసైడ్ చేస్తారు: తాప్సీ
సినీ ఇండస్ట్రీపై బోల్డ్‌గా మాట్లాడే హీరోయిన్ తాప్సీ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ఒక సినిమాలో అప్పటికే పెద్ద హీరో ఉన్నాడంటే ఎక్కువ డబ్బు పెట్టి హీరోయిన్‌ను తీసుకోరని చెప్పారు. పైగా ఎవర్ని తీసుకోవాలనేది కూడా హీరోలే డిసైడ్ చేస్తారని అసంతృప్తి వ్యక్తం చేశారు. కొందరు సక్సెస్‌ఫుల్ డైరెక్టర్లు మాత్రమే హీరో మాటను కాదని కథకు తగ్గట్లు హీరోయిన్లను ఎంపిక చేసుకుంటారని ఓ ఇంటర్వ్యూలో తాప్సీ చెప్పారు.
News November 4, 2024
దారుణంగా పడిపోయిన AQ.. లాహోర్ ఉక్కిరిబిక్కిరి
పాక్‌లోని లాహోర్‌లో ఎయిర్ క్వాలిటీ దారుణంగా పడిపోయింది. అక్కడ AQI రికార్డ్ స్థాయిలో 1900 దాటింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అధికారులు స్థానిక స్కూళ్లకు వారం సెలవులు ప్రకటించారు. ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇచ్చారు. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని, తప్పనిసరిగా మాస్కులు ధరించాలని హెచ్చరించారు. మనదేశంలో AQI అత్యధికంగా ఢిల్లీలో 300పైన నమోదవుతుంటుంది.