News November 30, 2024
పవర్‌ను జన్మహక్కుగా భావించేవాళ్లు పదేళ్లుగా పవర్‌లో లేరు: మోదీ

ప్రతిపక్షాలు రాజ్యాంగ స్ఫూర్తిని నలిపేశాయని PM మోదీ అన్నారు. డెమోక్రసీలో అన్ని రూల్స్‌ను తిరస్కరిస్తూ, ప్రజల్ని మోసగించి అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయని దుయ్యబట్టారు. ‘పవర్ తమ జన్మహక్కుగా భావించేవాళ్లు పదేళ్లుగా పవర్‌లో లేరు. ఆది నుంచీ వారు BJP-NDAకు ప్రజలిచ్చిన తీర్పును అంగీకరించడం లేదు. పదేళ్లుగా పవర్‌లో లేకపోవడంతో దేశంపై కుట్రలకు వెనుకాడటం లేదు’ అని పరోక్షంగా రాహుల్‌ను విమర్శించారు.
Similar News
News October 17, 2025
నేటి నుంచి ఉచితంగా చేప పిల్లల పంపిణీ

TG: రాష్ట్రవ్యాప్తంగా మత్య్సకారులకు ఉచితంగా చేప పిల్లల పంపిణీ నేడు ప్రారంభం కానుంది. 88 కోట్ల చేప, 10 కోట్ల రొయ్య పిల్లలను ప్రభుత్వం అందించనుంది. 32 జిల్లాల్లోని 46వేల చెరువులు, కుంటలు, రిజర్వాయర్లలో పెంచేందుకు వీలుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇందుకు రూ.123 కోట్లు ఖర్చు చేస్తోంది. మక్తల్‌లో మంత్రులు వాకిటి శ్రీహరి, దామోదర రాజనర్సింహ, జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొంటారు.
News October 17, 2025
భారీగా పెరిగిన బంగారం, తగ్గిన వెండి ధరలు!

ధన త్రయోదశికి ముందు బంగారం ధరలు భారీగా పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. ఇవాళ HYD బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.3,330 పెరిగి ₹1,32,770కు చేరింది. ఏడు రోజుల్లో రూ.9,060 పెరగడం గమనార్హం. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ. 3,050 ఎగబాకి ₹1,21,700గా ఉంది. అటు వెండి ధర మాత్రం రూ.3,000 తగ్గింది. కేజీ సిల్వర్ రేటు రూ.2,03,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News October 17, 2025
భారత్‌తో సిరీస్.. ఆసీస్ కీలక ప్లేయర్ ఔట్

భారత్‌తో వన్డే సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియాకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ కండరాల నొప్పితో సిరీస్‌కు దూరమయ్యారు. అతని స్థానంలో మార్నస్ లబుషేన్‌ను ఎంపిక చేశారు. ఈ నెల 19న తొలి వన్డే పెర్త్‌లో, 23న రెండోది అడిలైడ్, మూడో వన్డే 25న సిడ్నీలో జరగనుంది. మొదటి మ్యాచ్ పెర్త్‌లో జరగనుండగా, అక్కడి బౌన్సీ పిచ్ మన బ్యాటర్లకు సవాలు విసరనుందని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.