News October 14, 2024
ఈజిప్షియన్ ఎడారుల్లో వేల ఏళ్ల నాటి రాతివృత్తం

పురాతన మనుషుల జీవన విధానానికి సంబంధించిన విషయాలు ఆసక్తికరంగా, ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. ఇటీవల ఈజిప్షియన్ ఎడారుల్లో ఓ రాతి వృత్తాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీనిని ఖగోళ అబ్జర్వేటరీగా ప్రాచీనులు ఉపయోగించి ఉంటారని తెలిపారు. 7,500 ఏళ్ల క్రితం నివసించిన నుబియన్లు దీనిని క్యాలెండర్ సర్కిల్‌గా ఉపయోగించేవారన్నారు. దీంతో కాలాల గమనం, కాలానుగుణంగా పెరిగే ప్రకాశవంతమైన నక్షత్రాల గురించి తెలుసుకునేవారు.
Similar News
News December 10, 2025
కోడి పిల్లల పెంపకం – బ్రూడింగ్ కీలకం

కోడి పిల్లలు గుడ్డు నుంచి బయటకొచ్చాక కృత్రిమంగా వేడిని అందించడాన్ని “బ్రూడింగ్” అంటారు. వాతావరణ పరిస్థితులను బట్టి బ్రూడింగ్‌ను 4-6 వారాల పాటు చేపట్టాల్సి ఉంటుంది. అయితే బ్రూడర్ కింద వేడిని కోడి పిల్లల వయసును బట్టి క్రమంగా తగ్గించాలి. బ్రూడర్ కింద వేడి ఎక్కువైతే పిల్లలు దూరంగా వెళ్లిపోతాయి. తక్కువైతే పిల్లలన్నీ మధ్యలో గుంపుగా ఉంటాయి. దీన్ని బట్టి వేడిని అంచనా వేసి వేడిని తగ్గించడం, పెంచడం చేయాలి.
News December 10, 2025
తెలంగాణ న్యూస్ రౌండప్

⭒ నేడు ఉస్మానియా వర్సిటీకి సీఎం రేవంత్.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి బహిరంగ సభలో ప్రసంగించనున్న సీఎం
⭒ 2047 నాటికి HYDలో 623kms మేర మెట్రో నెట్‌వర్క్‌ను విస్తరించనున్నట్లు విజన్ డాక్యుమెంట్లో పేర్కొన్న ప్రభుత్వం
⭒ యువతకు అడ్వాన్స్డ్ స్కిల్స్‌పై శిక్షణ, ఉపాధి కల్పనపై టాటా టెక్, అపోలో సహా పలు సంస్థలతో ప్రభుత్వం రూ.72కోట్ల విలువైన 9 ఒప్పందాలు
News December 10, 2025
గాయపడిన సింహం.. తిరిగొచ్చి అదరగొట్టింది!

‘గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జనకన్నా భయంకరంగా ఉంటుంది’ అనే డైలాగ్ హార్దిక్ పాండ్యకు సరిగ్గా సరిపోతుంది. గాయం నుంచి కోలుకుని SAతో తొలి T20లో రీఎంట్రీ ఇచ్చిన అతడు 28 బంతుల్లో 59* రన్స్ చేశారు. ఓవైపు ఇతర బ్యాటర్లు వికెట్ కాపాడుకునేందుకే అవస్థలు పడుతుంటే పాండ్య మాత్రం కామ్&కంపోజ్డ్ షాట్లతో విరుచుకుపడ్డారు. బౌలింగ్‌లోనూ తొలి బంతికే వికెట్ తీశారు. ఇరు జట్లలో వేరే ఏ ఆటగాడు 30+ స్కోర్ చేయలేదు.


