News October 14, 2024

ఈజిప్షియన్ ఎడారుల్లో వేల ఏళ్ల నాటి రాతివృత్తం

image

పురాతన మనుషుల జీవన విధానానికి సంబంధించిన విషయాలు ఆసక్తికరంగా, ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. ఇటీవల ఈజిప్షియన్ ఎడారుల్లో ఓ రాతి వృత్తాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీనిని ఖగోళ అబ్జర్వేటరీగా ప్రాచీనులు ఉపయోగించి ఉంటారని తెలిపారు. 7,500 ఏళ్ల క్రితం నివసించిన నుబియన్‌లు దీనిని క్యాలెండర్ సర్కిల్‌గా ఉపయోగించేవారన్నారు. దీంతో కాలాల గమనం, కాలానుగుణంగా పెరిగే ప్రకాశవంతమైన నక్షత్రాల గురించి తెలుసుకునేవారు.

Similar News

News November 6, 2024

రక్షణ మంత్రిని తొలగించిన నెతన్యాహు

image

గాజాతో యుద్ధం వేళ ఇజ్రాయెల్ PM నెతన్యాహు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. రక్షణ మంత్రి యోవ్ గాలంట్‌ను తొలగించారు. ‘కొన్ని నెలలుగా విశ్వాసం సన్నగిల్లుతోంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా’ అని ఆయన ప్రకటించారు. గాలంట్ స్థానంలో ఫారిన్ మినిస్టర్ ఇజ్రాయెల్ కాజ్‌ను నియమించారు. FMగా గిడోన్ సార్‌ బాధ్యతలు చేపట్టారు. గాజా యుద్ధం మొదలైనప్పటి నుంచే నెతన్యాహు, గాలంట్ మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది.

News November 6, 2024

వాళ్లు గెలిస్తే మమ్మల్ని జైల్లో పెడతారు: ట్రంప్ లాయర్

image

అమెరికాలో పోలింగ్ వేళ రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ లాయర్ రూడీ గిలానీ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘డెమొక్రాట్లు మోసం చేయడంలో సమర్థులు. ఒకవేళ వాళ్లు గెలిస్తే నన్ను, ట్రంప్‌ను జీవితాంతం జైల్లో వేస్తారు. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ల విజయానికి చేయాల్సిందంతా చేశాను. నా దేశం కోసం పనిచేశాను’ అని ఆయన అన్నారు. కాగా న్యూయార్క్ మేయర్‌గా పనిచేసిన గిలానీ ట్రంప్ కేసులు వాదించి పాపులర్ అయ్యారు.

News November 6, 2024

నవంబర్ 6: చరిత్రలో ఈరోజు

image

* పర్యావరణ దోపిడీని నిరోధించే దినోత్సవం
* 1940: గాయని, రచయిత రాజ్యలక్ష్మి జననం
* 1948: ఆధ్యాత్మికవేత్త ముంతాజ్ అలీ జననం
* 1962: సినీనటి అంబిక పుట్టినరోజు
* 1951: భారత మొదటి ప్రధాన న్యాయమూర్తి హీరాలాల్ జెకిసుందాస్ కనియా మరణం
* 1985: బాలీవుడ్ నటుడు సంజీవ్ కుమార్ మరణం(ఫొటోలో)