News September 19, 2024

మళ్లీ తుఫాను ముప్పు.. అతిభారీ వర్షాలకు ఛాన్స్

image

AP: ఉత్తర, మధ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఈ నెల 24న అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ నిపుణులు వెల్లడించారు. ఇది తీవ్రరూపం దాల్చి తుఫానుగా మారే అవకాశం ఉందని తెలిపారు. దీనివల్ల ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఉ.గో, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. పశ్చిమ వాయవ్య దిశగా వీస్తున్న గాలుల ప్రభావంతో రేపటి నుంచి వానలు పడే అవకాశం ఉందన్నారు.

Similar News

News September 19, 2024

కొత్త రేషన్ కార్డులపై గుడ్‌న్యూస్

image

TG: అక్టోబర్ 2 నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించాలని అధికారులను CM రేవంత్ రెడ్డి ఆదేశించారు. రేషన్ కార్డుల జారీ విధివిధానాలపై సచివాలయంలో అధికారులతో సీఎం సమీక్షించారు. అర్హులందరికీ డిజిటల్ రేషన్ కార్డులు అందించాలని స్పష్టం చేశారు. కార్డుల జారీకి ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై మరోసారి సమీక్ష నిర్వహించాలని మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, దామోదరలను CM ఆదేశించారు.

News September 19, 2024

మూడు జిల్లాలకు YCP అధ్యక్షుల నియామకం

image

AP: మరో మూడు జిల్లాలకు వైసీపీ అధ్యక్షులను నియమించింది. శ్రీకాకుళం-ధర్మాన కృష్ణదాస్, విజయనగరం-మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), పార్వతీపురం మన్యం-శత్రుచర్ల పరీక్షిత్ రాజు, శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడిగా తమ్మినేని సీతారాం‌ను నియమిస్తూ ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేశారు.

News September 19, 2024

సీఎం సహాయనిధికి సింగరేణి విరాళం

image

TG: వరద బాధితుల సహాయం కోసం సీఎం సహాయనిధికి సింగరేణి సంస్థ భారీ విరాళం అందించింది. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి సింగరేణి ఎండీ బలరాం, ఎమ్మెల్యే, కార్మిక సంఘాల నేతలు సచివాలయంలో రూ.10.25 కోట్ల చెక్కులను అందించారు. దీంతో సింగరేణి ఉద్యోగులను సీఎం రేవంత్ అభినందించారు.