News September 19, 2024
మళ్లీ తుఫాను ముప్పు.. అతిభారీ వర్షాలకు ఛాన్స్
AP: ఉత్తర, మధ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఈ నెల 24న అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ నిపుణులు వెల్లడించారు. ఇది తీవ్రరూపం దాల్చి తుఫానుగా మారే అవకాశం ఉందని తెలిపారు. దీనివల్ల ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఉ.గో, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. పశ్చిమ వాయవ్య దిశగా వీస్తున్న గాలుల ప్రభావంతో రేపటి నుంచి వానలు పడే అవకాశం ఉందన్నారు.
Similar News
News October 10, 2024
Stock Market: స్వల్ప లాభాలతో గట్టెక్కాయి
స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 144 పాయింట్ల లాభంతో 81,611 వద్ద, నిఫ్టీ 16 పాయింట్ల లాభంతో 24,998 వద్ద స్థిరపడ్డాయి. సెన్సెక్స్‌లో 82,000 వద్ద ఉన్న రెసిస్టెన్స్ అడ్డుగోడలా పనిచేయడంతో సూచీ ముందుకు కదల్లేదు. అటు నిఫ్టీలోనూ 25,135 వద్ద Day Highని సూచీ దాటలేదు. Kotak Bank, JSW Steel, HDFC, BEL టాప్ గెయినర్స్. Cipla, Techm, Trent, Sun Pharma టాప్ లూజర్స్.
News October 10, 2024
పవన్ కళ్యాణ్‌కు మరోసారి అస్వస్థత
AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారు. ఈ కారణంగానే ఇవాళ క్యాబినెట్ సమావేశానికి ఆయన హాజరుకాలేదు. ఇటీవల తిరుమలకు కాలినడకన వెళ్లిన ఆయన అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. జ్వరంతో బాధపడుతూనే వారాహి సభలో పాల్గొన్నారు.
News October 10, 2024
టెన్నిస్‌కు రఫెల్ నాదల్ గుడ్ బై
స్పెయిన్ దిగ్గజ ఆటగాడు రఫెల్ నాదల్ టెన్నిస్‌కు వీడ్కోలు పలికారు. వచ్చే నెలలో జరిగే డేవిస్ కప్ తనకు చివరి సిరీస్ అని ఆయన ప్రకటించారు. కాగా 38 ఏళ్ల నాదల్‌ను ‘కింగ్ ఆఫ్ క్లే’గా పిలుస్తారు. ఆయన ఇప్పటివరకు 22 గ్రాండ్ స్లామ్, 14 ఫ్రెంచ్ ఓపెన్, 4 యూఎస్ ఓపెన్, 2 వింబుల్డన్ టైటిళ్లు నెగ్గారు. దాదాపు ఐదేళ్లు వరల్డ్ నంబర్ వన్ టెన్నిస్ ప్లేయర్‌గా కొనసాగారు. ఫెడరర్‌పై 40, జకోవిచ్‌పై 60 మ్యాచులు గెలిచారు.