News October 11, 2024
తుఫాను ముప్పు.. మూడు రోజులు భారీ వర్షాలు

AP: రాష్ట్రానికి మరో తుఫాను ముప్పు పొంచి ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈ నెల 14 నుంచి 16 వరకు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరోవైపు అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం రెండు, మూడు రోజుల్లో వాయుగుండంగా బలపడుతుందని పేర్కొంది. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
Similar News
News November 15, 2025
ముద్దు సీన్లలో నటించాలని ఒత్తిడి చేశారు: చాందిని చౌదరి

కెరీర్ ప్రారంభంలో ఓ మూవీలో ముద్దు సీన్లలో నటించాలని ఒత్తిడి తెచ్చారని హీరోయిన్ చాందిని చౌదరి అన్నారు. ‘కథ చెప్పినప్పుడు ముద్దు సీన్ల గురించి చెప్పలేదు. ఆ సమయంలో అర్జున్‌రెడ్డి సినిమా విడుదలై హిట్ అయింది. దీంతో మా సినిమాలోనూ కిస్ సీన్లు పెడితే హిట్ అవుతుందని అనుకున్నారు. దర్శకుడు చెప్పినట్టు చేయకపోతే చెడ్డపేరు వస్తుంది. అయితే, హీరో చేయనని చెప్పడంతో ఊపిరిపీల్చుకున్నాను’ అని చెప్పారు.
News November 15, 2025
HOCLలో 72 పోస్టులు

కేరళలోని హిందుస్థాన్ ఆర్గానిక్ కెమికల్ లిమిటెడ్ (HOCL)72 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఇంజినీరింగ్ డిగ్రీ, BSc, డిప్లొమా, ITI అర్హతగల అభ్యర్థులు ఈనెల 26వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 ఏళ్లు నిండి ఉండాలి. షార్ట్‌లిస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్, రాతపరీక్ష/స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ముందుగా NATS పోర్టల్‌లో రిజిస్ట్రర్ చేసుకోవాలి. వెబ్‌సైట్: www.hoclindia.com/
News November 15, 2025
లక్నోకు అర్జున్, షమీ.. DCకి నితీశ్ రాణా

ఐపీఎల్ రిటెన్షన్ గడువు నేటితో ముగుస్తుండటంతో ఫ్రాంచైజీలు ఆటగాళ్లను ట్రేడ్ చేస్తున్నాయి. ముంబై ఇండియన్స్ నుంచి సచిన్ కొడుకు అర్జున్ టెండూల్కర్ లక్నోకు వెళ్లారు. సన్‌రైజర్స్ బౌలర్ షమీ కూడా LSG జట్టులో చేరారు. అటు రాజస్థాన్ రాయల్స్‌ను వీడిన నితీశ్ రాణా ఢిల్లీ క్యాపిటల్స్‌లో చేరారు. KKR ప్లేయర్ మయాంక్ మార్కండేను ముంబై ట్రేడ్ చేసుకుంది.


