News October 20, 2024
12 విమానాలకు బెదిరింపులు

విస్తారా, ఆకాశ ఎయిర్‌లైన్ కంపెనీలకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. చెరో ఆరు విమానాల పేర్లతో సోషల్ మీడియా వేదికగా ఈ బెదిరింపులు వచ్చినట్లు ఆయా సంస్థలు ధ్రువీకరించాయి. వెంటనే అప్రమత్తమై ఎమర్జెన్సీ టీమ్‌ను యాక్టివేట్ చేసినట్లు తెలిపాయి. ఇటీవల కొందరు ఆకతాయిలు విమానాలకు బాంబు బెదిరింపులు చేస్తున్న ఘటనలు వరుసగా వెలుగు చూస్తున్నాయి. మరి ఇది కూడా అలాంటిదేనా? అనేది తెలియాల్సి ఉంది.
Similar News
News October 28, 2025
కర్నూలు ప్రమాదం.. 19 వాహనాలు తప్పించుకున్నాయ్!

AP: కర్నూలు బస్సు ప్రమాదానికి సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బైకర్ శివశంకర్ 2.45amకు డివైడర్‌ను ఢీకొట్టి అక్కడికక్కడే చనిపోగా, బైకు రోడ్డు మధ్యలో పడింది. vకావేరీ బస్సు 2.55am ప్రాంతంలో బైకును ఢీకొట్టింది. అయితే ఈ మధ్యలో 19 వాహనాలు బైకును తప్పించుకొని వెళ్లాయి. ఈ బస్సు డ్రైవర్‌కు అది కనిపించలేదా? నిర్లక్ష్యమా? అనేది తేలాల్సి ఉంది. ఆ బైకును ఒక్కరు పక్కకు జరిపినా 19ప్రాణాలు దక్కేవి.
News October 28, 2025
‘మీ ఫోన్ ఏమైంది?’ జనార్దనరావుకు సిట్ ప్రశ్నలు

AP: నకిలీ మద్యం కేసులో సిట్ అధికారులు జనార్దనరావును అతని ఫోన్ గురించి అడిగినట్లు తెలుస్తోంది. ‘SA వెళ్లాక మీ ఫోన్ ఏమైంది? ఆధారాలు బయట పడతాయని ధ్వంసం చేశారా? ములకలచెరువులో నకిలీ మద్యం యూనిట్ వెలుగుచూశాకే మీ ఫోన్ పోయిందా?’ అని ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. తన ఫోన్ చోరీకి గురైందని, ఎలా పోయిందో తెలియలేదని జనార్దనరావు సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది. అందులో ఆధారాలున్నాయా? అని అడగ్గా మౌనంగా ఉండిపోయారు.
News October 28, 2025
145 పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ పరిధిలోని సెంట్రల్ ఫెసిలిటీ సెంటర్స్‌లో 145 కాంట్రాక్ట్ యంగ్ ప్రొఫెషనల్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి ICAI/ICOAI/ICSIలో ఇంటర్మీడియట్/ ఎగ్జిక్యూటివ్ లెవల్లో ఉత్తీర్ణులైన CA/CS/CMS అభ్యర్థులు అర్హులు. వయసు 35ఏళ్ల లోపు ఉండాలి. వెబ్సైట్: https://www.mca.gov.in *మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.


