News October 20, 2024
12 విమానాలకు బెదిరింపులు
విస్తారా, ఆకాశ ఎయిర్‌లైన్ కంపెనీలకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. చెరో ఆరు విమానాల పేర్లతో సోషల్ మీడియా వేదికగా ఈ బెదిరింపులు వచ్చినట్లు ఆయా సంస్థలు ధ్రువీకరించాయి. వెంటనే అప్రమత్తమై ఎమర్జెన్సీ టీమ్‌ను యాక్టివేట్ చేసినట్లు తెలిపాయి. ఇటీవల కొందరు ఆకతాయిలు విమానాలకు బాంబు బెదిరింపులు చేస్తున్న ఘటనలు వరుసగా వెలుగు చూస్తున్నాయి. మరి ఇది కూడా అలాంటిదేనా? అనేది తెలియాల్సి ఉంది.
Similar News
News November 5, 2024
కమల పూర్వీకుల గ్రామంలో ప్రత్యేక పూజలు
US అధ్యక్ష ఎన్నికలు ఇవాళ జరగనున్నాయి. భారత సంతతికి చెందిన కమలా హారిస్ డెమోక్రాటిక్ అభ్యర్థిగా బరిలో నిలిచిన విషయం తెలిసిందే. దీంతో ఆమె పూర్వీకుల గ్రామమైన TNలోని తులసేంద్రపురం ఆలయంలో స్థానికులు ప్రత్యేక పూజలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఆలయం వద్ద ‘ది డాటర్ ఆఫ్ ది ల్యాండ్’ అంటూ బ్యానర్ ఏర్పాటు చేశారు. కమలా హారిస్ తాత పీవీ గోపాలన్ ఇదే గ్రామంలో జన్మించారు.
News November 5, 2024
పుట్టినరోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News November 5, 2024
FUN: ఎవరూ చెప్పని, ఎక్కడా రాయని కొన్ని రూల్స్!
* సోషల్ మీడియాలో సోదరితో ఫొటోను అప్‌లోడ్ చేస్తే ఆమె మీ సోదరి అని క్యాప్షన్‌లో రాయాలి.
* ఇంటిముందు చెప్పులు తలకిందులుగా ఉంటే మనం ఎంత బిజీగా ఉన్నా వాటిని సరిచేయాలి.
* నాన్న గదిలోకి రాగానే ఫోన్‌ను దాచిపెట్టి, ఫోన్ వాడనట్లు నటించాలి.
* మీరు ఎవరితో చాటింగ్ చేస్తున్నా నవ్వు ఆపుకోవాలి.
* మెట్రో, రైల్వే స్టేషన్ నుంచి బయటకు రాగానే ఆటో రిక్షాలను చూడనట్లు నటించాలి.