News April 12, 2024

ఫోన్‌, గేమ్స్‌కు బానిసైన పిల్లలకు ముప్పు: పరిశోధన

image

స్మార్ట్‌ఫోన్స్, వీడియో గేమ్స్‌కు బానిసలైన పిల్లలకు భవిష్యత్తులో మానసిక వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయని కెనడా పరిశోధకులు వెల్లడించారు. వీరికి 23ఏళ్లు వచ్చేసరికి భ్రమ కలగడం, మతిస్థిమితం కోల్పోవడం వంటి సమస్యలు వస్తాయట. ముఖ్యంగా టీనేజ్‌లో ఈ గేమింగ్‌కు అడిక్ట్ అయితే ఈ ప్రభావం 3-7% ఎక్కువ ఉంటుందట. స్మార్ట్‌ఫోన్ల వినియోగం తగ్గించకుంటే పేరెంట్స్-పిల్లల మధ్య బంధం సైతం దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు.

Similar News

News October 11, 2024

నేడు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు శంకుస్థాపన చేయనున్న సీఎం

image

TG: రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ తీసుకురానుంది. దీనిలో భాగంగా ఇవాళ 28 స్కూళ్లకు ఒకేసారి శంకుస్థాపన జరగనుంది. రంగారెడ్డిలోని షాద్‌నగర్ వద్ద సీఎం రేవంత్, మధిరలో డిప్యూటీ సీఎం ఈ కాంప్లెక్సులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే వీటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.5వేల కోట్లు కేటాయించగా ఒక్కో స్కూల్ నిర్మాణానికి రూ.26 కోట్లు వెచ్చించనుంది.

News October 11, 2024

స్విగ్గీ బాయ్‌కాట్ నిర్ణయం వెనక్కి

image

AP: ఈ నెల 14 నుంచి స్విగ్గీ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్ <<14272365>>బాయ్‌కాట్<<>> చేయాలన్న నిర్ణయాన్ని హోటళ్లు, రెస్టారెంట్ల అసోసియేషన్ వెనక్కి తీసుకుంది. స్విగ్గీ యాజమాన్యంతో చర్చలు సానుకూలంగా జరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. నవంబర్ 1 నుంచి స్విగ్గీతో ఒప్పందాలు అమల్లోకి వస్తాయని పేర్కొంది.

News October 11, 2024

ఎన్‌కౌంటర్ మృతులు 34: బస్తర్ ఐజీ

image

ఈ నెల 5న ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ సమీపంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన వారి సంఖ్య 34 అని బస్తర్ ఐజీ సుందర్ రాజ్ తెలిపారు. తాము 31 మంది మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. మిగిలిన 3 మృతదేహాలను మావోయిస్టులు అడవిలోనే ఖననం చేసినట్లు పేర్కొన్నారు.