News December 9, 2024

పవన్ కళ్యాణ్‌ను చంపేస్తామని బెదిరింపులు

image

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు బెదిరింపులు కలకలం రేపాయి. ఆయనను చంపేస్తానని ఓ అగంతకుడు డిప్యూటీ సీఎం ఆఫీసుకు మెసేజ్ పంపినట్లు అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని పవన్ దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు దీనిపై డిప్యూటీ సీఎం పేషీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేపట్టారు.

Similar News

News January 23, 2025

నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

image

AP: అనంతపురం సమీపంలోని నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థి చరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఫస్ట్ ఇయర్ చదువుతున్న అతడు క్లాస్ జరుగుతుండగానే బయటికి వచ్చి మూడో అంతస్తు నుంచి దూకేశాడు. ఆసుపత్రికి తీసుకెళ్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. చరణ్‌ స్వస్థలం రామాపురంగా గుర్తించారు. ఇటీవల సంక్రాంతి సెలవులకు ఇంటికి వచ్చి వెళ్లిన చరణ్ ఇంతలోనే సూసైడ్ చేసుకోవడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.

News January 23, 2025

BIG NEWS.. రాష్ట్రంలో రూ.60వేల కోట్ల పెట్టుబడులు

image

దావోస్‌లోని వరల్డ్ ఎకనామిక్ సదస్సులో అమెజాన్ సంస్థతో తెలంగాణ ప్రభుత్వం భారీ పెట్టుబడిపై ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్‌లో రూ.60వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అమెజాన్ సంస్థ MOU చేసుకుంది. ఈ పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలో డేటా సెంటర్లను అమెజాన్ ఏర్పాటు చేయనుంది. అటు నిన్న ఒక్కరోజే రూ.56వేల కోట్లకుపైగా పెట్టుబడులపై పలు సంస్థలతో ప్రభుత్వం <<15232469>>ఒప్పందం <<>>కుదుర్చుకుంది.

News January 23, 2025

ఎయిర్‌పోర్టులో ఇంత తక్కువ ధరలా!

image

విమానాశ్రయాల్లోని కేఫ్‌లలో అధిక ధరలుంటాయన్న విమర్శలున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ఉడాన్ యాత్రి కేఫ్‌‌లను ఏర్పాటు చేసింది. ఇందులో టీ కేవలం రూ.10, వాటర్ బాటిల్ రూ.10, కాఫీ రూ.20కే విక్రయిస్తున్నారు. తాజాగా కోల్‌కతాలోని కేఫ్‌లో ధరలు చూసి ఓ నెటిజన్ షేర్ చేయగా వైరలవుతోంది. కాగా, ఎయిర్‌పోర్టుల్లో వాటర్ బాటిల్ కూడా రూ.100కు అమ్ముతున్నారని గత నెలలో ఎంపీ రాఘవ్ చద్దా పార్లమెంట్‌లో సమస్యను లేవనెత్తారు.