News April 12, 2025
ఎమ్మెల్సీ విజయశాంతికి బెదిరింపులు

TG: కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతికి బెదిరింపులు వచ్చాయి. తనకు డబ్బులు ఇవ్వాలని, లేకపోతే అంతు చూస్తానని చంద్రశేఖర్ అనే వ్యక్తి ఆమెకు మెసేజ్లు పంపాడు. దీంతో విజయశాంతి దంపతులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అతనిపై కేసు నమోదు చేశారు. చంద్రశేఖర్ గతంలో విజయశాంతి సోషల్ మీడియా ఖాతాలను నిర్వహించినట్లు సమాచారం.
Similar News
News November 17, 2025
US నుంచి LPG దిగుమతి.. తగ్గనున్న ధరలు: హర్దీప్సింగ్

అమెరికా నుంచి LPGని దిగుమతి చేసుకునేందుకు కీలక ఒప్పందం కుదిరిందని కేంద్ర మంత్రి హర్దీప్సింగ్ తెలిపారు. ‘ఏడాదిపాటు ఈ డీల్ అమల్లో ఉంటుంది. IND కంపెనీలు 2.2MTPA ఇంపోర్ట్ చేసుకుంటాయి. ఇది మొత్తం వార్షిక దిగుమతుల్లో 10 శాతానికి సమానం. ప్రజలకు మరింత తక్కువ ధరకు LPGని అందించడంలో ఇదొక ముందడుగు. ప్రస్తుతం సిలిండర్ ధర ₹1100 ఉన్నప్పటికీ ₹500-550కే అందిస్తున్నాం’ అని పేర్కొన్నారు.
News November 17, 2025
మాట్లాడుకుంటేనే సమస్యలకు పరిష్కారం

భార్యాభర్తల ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు వస్తుంటాయి. కొన్నిసార్లు అహం, ఇంకొన్నిసార్లు అపార్థాలు పలకరిస్తాయి. అలకలూ ఉంటాయి. వాటిని దాటితేనే బంధం పదిలంగా మారుతుంది. అభిప్రాయ భేదాలు వచ్చి అలిగినా తెగేదాకా లాగొద్దు. పరోక్ష వ్యాఖ్యానాలు చేయొద్దు. నేరుగానే పరిష్కరించుకోండి. సమస్య ఏదైనా ఎదుటివారికి మాట్లాడే అవకాశం ఇవ్వాలి. లేదంటే సమస్య పరిష్కారం కాకపోగా అవతలివారిలో రోజు రోజుకీ అసంతృప్తి పెరిగిపోతుంది.
News November 17, 2025
వేరుశనగ పంట కోత.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు

వేరుశనగ పంట కోత సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మొక్కలను పీకేటప్పుడు నేల గుల్లగా ఉండేలా చూసుకోవాలి. పంటలో 70 నుంచి 80 శాతం మొక్కల ఆకులు, కొమ్మలు పసుపు రంగులోకి మారి, కాయడొల్ల లోపల భాగం నలుపు రంగులోకి మారినప్పుడే పంటను కోయాలి. కోత సమయంలో నేలలో తగినంత తేమ ఉండేలా చూసుకోవాలి. మొక్క నుంచి కాయలను వేరుచేశాక కాయలను నిల్వచేసినప్పుడు, బూజుతెగులు రాకుండా స్థానిక వ్యవసాయ అధికారుల సూచనలు తీసుకోవాలి.


