News November 3, 2024

యూపీ సీఎంకు బెదిరింపులు.. పోలీసుల అదుపులో మహిళ

image

UP CM యోగీని హ‌త్య చేస్తామంటూ బెదిరింపు సందేశాలు పంపిన మ‌హిళను మ‌హారాష్ట్ర యాంటీ టెర్ర‌రిజ‌మ్ స్క్వాడ్, పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. థానేలోని ఉల్హాస్‌న‌గ‌ర్‌కు చెందిన ఫాతిమా ఖాన్ ఈ బెదిరింపులు పంపిన‌ట్టు గుర్తించి ఆమెను స్థానిక పోలీస్ స్టేష‌న్‌కు త‌ర‌లించారు. అయితే ఆమె మాన‌సిక స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న‌ట్టు పోలీసులు తెలిపారు. త‌దుప‌రి విచారణ, ప‌రీక్ష‌ల నిమిత్తం ఆమెను ముంబై తరలించారు.

Similar News

News December 5, 2024

రైల్వే ప్రయాణికులకు తీపి వార్త

image

ఇకపై ఎక్స్‌ప్రెస్, సూపర్ ఫాస్ట్ రైళ్లలో 4 జనరల్ బోగీలు జత చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన LHB కోచ్‌లు వీటికి అనుసంధానం చేస్తున్నట్లు వెల్లడించింది. ఒక్కో బోగీలో వంద మంది ప్రయాణించవచ్చని పేర్కొంది. మొత్తం 370 రైళ్లలో వీటిని అందుబాటులోకి తెస్తున్నామని, లక్ష మంది అదనంగా ప్రయాణించవచ్చని వివరించింది. వీటిల్లో ప్రమాదాలు జరిగినా తక్కువ నష్టం కలుగుతుందని పేర్కొంది.

News December 5, 2024

ఏపీలో 53 నూతన జూనియర్ కాలేజీలకు గ్రీన్‌సిగ్నల్

image

AP: రాష్ట్రవ్యాప్తంగా 53 నూతన జూనియర్ కాలేజీల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఇంటర్ విద్యా మండలి కార్యదర్శి కృతికా శుక్లా పంపిన ప్రతిపాదనలకు పాఠశాల విద్యా శాఖ కార్యదర్శి కోన శశిధర్ ఆమోదం తెలిపారు. 37 మండలాల్లో 47, రెండు పట్టణ ప్రాంతాల్లో 6 కాలేజీలను ఏర్పాటుచేయనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 480 జూనియర్ కాలేజీలున్నాయి.

News December 5, 2024

‘మేకిన్ ఇండియా’పై పుతిన్ ప్రశంసలు

image

చిన్న, మధ్యతరహా కంపెనీలకు స్థిరమైన పరిస్థితులను భారత ప్రభుత్వం, అక్కడి నాయకత్వం సృష్టించిందని రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. PM నరేంద్రమోదీ చేపట్టిన ‘మేకిన్ ఇండియా’ బాగుందని ప్రశంసించారు. ‘రష్యా ఇంపోర్ట్ సబ్‌స్టిట్యూషన్ ప్రోగ్రామ్‌లాగే మేకిన్ ఇండియా ఉంటుంది. భారత్‌లో తయారీ ప్లాంట్లను నెలకొల్పేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. అక్కడ పెట్టుబడులు లాభయదాకమని మేం విశ్వసిస్తున్నాం’ అని అన్నారు.