News December 16, 2024
నేడు రాజ్యసభలో ముగ్గురు సభ్యుల ప్రమాణస్వీకారం
రాజ్యసభ ఉపఎన్నికల్లో ఏపీ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన ముగ్గురు సభ్యులు ఇవాళ ప్రమాణస్వీకారం చేయనున్నారు. బీద మస్తాన్ రావు, ఆర్.కృష్ణయ్య, సానా సతీశ్ రాజ్యసభ సభ్యులుగా ప్రమాణం చేయనున్నారు. ఆర్.కృష్ణయ్యకు బీజేపీ రాజ్యసభ టికెట్ కేటాయించగా టీడీపీ నుంచి బీద మస్తాన్ రావు, సానా సతీశ్‌ను ఖరారు చేసిన సంగతి తెలిసిందే.
Similar News
News January 14, 2025
జనవరి 26 నుంచి ఉత్తరాఖండ్‌లో UCC అమలు
రిపబ్లిక్ డే నాటి నుంచి ఉత్తరాఖండ్‌లో యూనిఫాం సివిల్ కోడ్ అమలు చేయడానికి అక్కడి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. పెళ్లి, విడాకులు, వారసత్వం విషయాల్లో అన్ని మతాలకు ఉమ్మడి చట్టం అమలు కోసమే UCC తెస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్న జంటలు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో పాటు సాక్షుల వీడియోలను రికార్డు చేయాల్సి ఉంటుంది. కామన్ పోర్టల్ ఉంటుంది.
News January 14, 2025
మహా కుంభమేళాలో విషాదం
మహా కుంభమేళాలో విషాదం చోటు చేసుకుంది. మహారాష్ట్రకు చెందిన NCP(SP) నేత, షోలాపూర్ మాజీ మేయర్ మహేశ్ కొతె గుండెపోటుతో మరణించారు. ఇవాళ ఉదయం త్రివేణి సంగమం వద్ద నదిలో పవిత్ర స్నానం చేసేందుకు వెళ్లిన ఆయన అక్కడే గుండెపోటుకు గురయ్యారు. గమనించి తోటి భక్తులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మహేశ్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
News January 14, 2025
హరియాణా BJP చీఫ్‌పై గ్యాంగ్ రేప్ కేసు
హరియాణా BJP చీఫ్ మోహన్ లాల్ బడోలీపై హిమాచల్ పోలీసులు సామూహిక అత్యాచారం కేసు నమోదు చేశారు. HPలోని కసౌలిలో ఉన్న హోటల్‌లో July 3, 2023న మోహన్ లాల్, సింగర్ రాఖీ మిట్టల్ తనపై అత్యాచారం చేశారని ఢిల్లీకి చెందిన బాధితురాలు ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని, మ్యూజిక్ వీడియోలో అవకాశం ఇస్తానని నమ్మించిన వీరిద్దరూ దారుణానికి ఒడిగట్టారన్నారు. అయితే ఆమె ఎవరో తెలియదని మోహన్ లాల్ అన్నారు.