News July 21, 2024

నీట్ కేసులో మరో ముగ్గురు అరెస్ట్

image

నీట్ UG పేపర్ లీక్ కేసులో సీబీఐ శనివారం మరో ముగ్గురిని అరెస్ట్ చేసింది. వీరిలో ఒకరు NIT (జమ్‌షెద్‌పుర్‌‌) గ్రాడ్యుయేట్ కాగా మరో ఇద్దరు MBBS విద్యార్థులు. NIT గ్రాడ్యుయేట్ శశికాంత్ పాశ్వాన్ పేపర్ లీక్‌కు సంబంధించిన సూత్రధారుల్లో ఒకరని CBI తెలిపింది. మిగతా ఇద్దరు విద్యార్థులు డబ్బుల కోసం ఎగ్జామ్ పేపర్ సాల్వ్ చేసినట్లు పేర్కొంది. కాగా ఈ కేసులో ఇప్పటివరకు 21 మంది అరెస్ట్ చేసినట్లు వెల్లడించింది.

Similar News

News December 9, 2024

‘INDIA’ బాధ్యతలపై చర్చ ఎప్పుడైంది?: ఒమర్

image

INDIA కూట‌మి సార‌థ్య బాధ్య‌తలు మ‌మ‌తా బెన‌ర్జీకి ఇవ్వాల‌న్న డిమాండ్లు పెరుగుతున్న వేళ నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్ ఆచితూచి అడుగులేస్తోంది. లోక్‌స‌భ ఎన్నిక‌ల తర్వాత మిత్ర‌ప‌క్షాల భేటీనే జ‌ర‌గ‌లేద‌ని, అలాంట‌ప్పుడు నాయ‌క‌త్వ మార్పుపై ఎవరు చర్చించారని JK CM ఒమ‌ర్ అబ్దుల్లా ప్ర‌శ్నించారు. స‌మావేశం నిర్వహించినప్పుడు మ‌మ‌త సార‌థ్య బాధ్య‌త‌లు కోర‌వ‌చ్చని, అప్పుడే ఈ విషయంపై చ‌ర్చ జ‌రుగుతుంద‌న్నారు.

News December 9, 2024

నాగబాబుకు మంత్రి పదవి

image

AP: రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. జనసేన నేత నాగబాబును క్యాబినెట్‌లోకి తీసుకోవాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. త్వరలోనే ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. దీంతో నాగబాబుకు ఏ శాఖ ఇస్తారనేది ఆసక్తిగా మారింది.

News December 9, 2024

మంచు మనోజ్‌పై మోహన్ బాబు ఫిర్యాదు

image

మంచు ఫ్యామిలీలో గొడవ తారస్థాయికి చేరుతోంది. తనపై దాడి చేశారంటూ కొద్దిసేపటి క్రితమే మనోజ్ పహాడీ షరీఫ్ PSలో ఫిర్యాదు చేశారు. తాజాగా తన కొడుకు మనోజ్‌పై మోహన్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రాచకొండ సీపీకి ఆయన లేఖ రాశారు. మనోజ్‌తో పాటు కోడలు మౌనిక నుంచి తనకు ముప్పు పొంచి ఉందని, రక్షణ కల్పించాలని లేఖలో పేర్కొన్నారు. దీంతో ఈ వ్యవహారం ఎక్కడివరకు వెళ్తుందోనని మంచు అభిమానులు చర్చించుకుంటున్నారు.