News October 29, 2024

వాషింగ్టన్ సుందర్‌ కోసం మూడు జట్ల పోటీ

image

న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో అదరగొట్టిన వాషింగ్టన్ సుందర్‌కి IPLలో డిమాండ్ అమాంతం పెరిగింది. సన్‌రైజర్స్ అతడిని రిటెయిన్ చేసుకోవట్లేదన్న సమాచారం బయటికొచ్చిన నేపథ్యంలో సీఎస్కే, ముంబై, గుజరాత్ జట్లు అతడిని వేలంలో దక్కించుకోవాలని భావిస్తున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపింది. మరి SRH సుందర్‌ని వేలంలో తిరిగి దక్కించుకుంటుందా లేక వదిలేస్తుందా అన్నది చూడాల్సి ఉంది.

Similar News

News November 13, 2024

మహిళలూ.. ఇలా జుట్టు వేసుకుంటున్నారా?

image

అమ్మాయిలు వెంట్రుకలను వెనక్కి గట్టిగా లాగి పోనీ టేల్ వేసుకోవడం వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పోనీ టేల్స్ వల్ల హెడేక్ రావడంతో పాటు మెడ నరాల్లో నొప్పి పెరిగి నడుము నొప్పి రావొచ్చు. ముఖ్యంగా హెయిర్ ఫాల్ అవుతుంది. దురద వల్ల అసౌకర్యానికి లోనవుతారు. నరాలపైన ఒత్తిడి పెరిగి మైగ్రేన్ హెడేక్‌కు దారితీయవచ్చు’ అని చెబుతున్నారు. ఫ్యాషన్ కోసం ఇలా చేయడం మానేయాలంటున్నారు. SHARE IT

News November 13, 2024

టూత్‌పేస్ట్‌పై ఈ కలర్ కోడ్స్ ఏంటి?

image

నిత్యం వినియోగించే టూత్ పేస్టుల్లో కలర్ కోడ్స్ ఉండటం గమనించారా? ఇవేమీ డిజైన్ కోసం వేసినవి కాదు. మొత్తం నాలుగు రంగుల స్ట్రిప్స్‌ను టూత్ పేస్ట్ కవర్‌పై చూడవచ్చు. ఇందులో బ్లూ రంగు న్యాచురల్ & మెడిసిన్స్‌తో కూడినదని సూచిస్తుంది. రెడ్ కలర్ న్యాచురల్ & కెమికల్స్ యాడ్ చేసినదని, గ్రీన్ కలర్ ఉంటే న్యాచురల్‌గా తయారుచేసిందన్నమాట. ఇక స్ట్రిప్‌పై బ్లాక్ కలర్ ఉంటే అది పూర్తిగా కెమికల్స్‌తో చేసిందని అర్థం.

News November 13, 2024

కులగణన గేమ్ చేంజర్ కాబోతోంది: CM రేవంత్

image

TG: రాష్ట్రంలో చేపట్టిన కులగణన గేమ్ చేంజర్ కాబోతోందని CM రేవంత్ అన్నారు. సంక్షేమ ఫలాలు అర్హులైన పేదలకు చేరాలంటే ప్రభుత్వం వద్ద సరైన గణాంకాలు ఉండాలని అభిప్రాయపడ్డారు. అసలు గణాంకాలు లేకుంటే అసలైన అర్హులకు న్యాయం చేయలేమని అన్నారు. అందుకే కులగణన చేపట్టామని, ఇదొక మైలురాయిగా మిగులుతుందని ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో ఇంటర్వ్యూలో ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.