News November 23, 2024
14 ఏళ్లలో మూడు సార్లే.. ప్రతిసారి KL రాహుల్ తోడు!
ఆస్ట్రేలియాతో మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 150కే ఆలౌట్ అయిన టీమ్ఇండియా, రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ పడకుండా 172 రన్స్ చేయగలిగింది. గత 14 ఏళ్లలో ’SENA‘ దేశాలపై టెస్టుల్లో టీమ్ఇండియా కేవలం 3 సార్లు 100+రన్స్ భాగస్వామ్యం చేయగలిగినట్లు క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. లార్డ్స్‌లో రోహిత్-KL రాహుల్, సెంచూరియన్‌లో మయాంక్-రాహుల్, ఇప్పుడు పెర్త్‌లో జైస్వాల్-రాహుల్ 100+ రన్స్ పార్ట్‌నర్‌షిప్ చేయగలిగారు.
Similar News
News December 6, 2024
రోదసిలో నడవనున్న సునీతా విలియమ్స్
భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ వచ్చే ఏడాది రోదసిలో నడవనున్నారు. అందుకోసం అవసరమైన ఏర్పాట్లను ఆమె సిద్ధం చేసుకుంటున్నారు. సూట్స్‌లో డేటా రికార్డర్ బాక్స్, ఆక్సిజన్ పనితీరు వంటివాటిపై ఆమె పనిచేస్తున్నారని నాసా తెలిపింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఆమె భూమికి తిరిగిరానున్నారు. వారం రోజుల మిషన్ కోసం అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన ఆమె సాంకేతిక కారణాలతో 6 నెలలకు పైగా అక్కడే ఉండిపోయిన సంగతి తెలిసిందే.
News December 6, 2024
పుష్ప-2 డైలాగ్స్.. జనసేన నేత కీలక వ్యాఖ్యలు
అల్లు రామలింగయ్య, మెగాస్టార్ కుటుంబాలు రెండు కాదు ఒక్కటేనని ఏపీ జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ చెప్పారు. వాళ్లు స్వయంకృషితో ఎదిగారు తప్ప కుటుంబం పేరు వాడుకోలేదన్నారు. ఇప్పుడు పుష్ప-2 సినిమాలో అల్లు అర్జున్ డైలాగులకు పెడార్థాలు తీసి అభిమానుల్లో అగ్గి రాజేసే పనిలో వైసీపీ శ్రేణులు, పెయిడ్ ఎనలిస్టులు ఉన్నారని ఆరోపించారు. సినిమాను సినిమాగానే చూడాలని, వారి ట్రాప్‌లో పడొద్దని సూచించారు.
News December 6, 2024
అంబేడ్కర్ కీర్తిని చాటేందుకు కృషి చేశాం: KCR
TG: అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా BRS అధినేత KCR ఆయన సేవలను స్మరించుకున్నారు. ‘సమసమాజ నిర్మాణ దార్శనికుడు అంబేడ్కర్. వివక్షకు వ్యతిరేకంగా జీవితకాలం పోరాడారు. ఆయన కీర్తిని ప్రపంచానికి చాటేందుకు కృషి చేశాం. అణగారిన వర్గాలకు సమన్యాయం దక్కేలా అంబేడ్కర్ చేసిన కృషి మరువలేనిది. ఆయన రాసిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 తెలంగాణ ఏర్పాటుకు మార్గం చూపింది’ అని KCR గుర్తుచేసుకున్నారు.