News October 27, 2024
రాజా సాబ్‌ను ఢీకొట్టనున్న థగ్ లైఫ్?

రెబల్ స్టార్ ప్రభాస్ ‘రాజాసాబ్’ వచ్చే ఏడాది ఏప్రిల్ 10న విడుదల కానుంది. ప్రభాస్‌లాంటి మాస్ హీరో సినిమా వస్తోందంటే ఆ డేట్‌కి వేరే సినిమా రిలీజెస్ సాధారణంగా ఉండవు. కానీ కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్లో తెరకెక్కుతున్న థగ్ లైఫ్ మూవీని అదే డేట్‌కు తీసుకురావాలని భావిస్తున్నట్లు కోలీవుడ్ డిస్ట్రిబ్యూషన్ వర్గాలు చెబుతున్నాయి. రాజాసాబ్‌తో తమిళనాట తమకు ఇబ్బంది ఉండదని వారు భావిస్తున్నట్లు సమాచారం.
Similar News
News March 18, 2025
27 నుంచి శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు

AP: శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో ఈ నెల 27 నుంచి 31 వరకు ఉగాది మహోత్సవాలు జరగనున్నాయి. పెద్ద ఎత్తున భక్తులు తరలిరానుండటంతో అధికారులు పటిష్ఠ ఏర్పాట్లు చేస్తున్నారు. క్యూలైన్లలో మంచినీరు, అల్పాహారం, బిస్కెట్స్ అందించాలని ఈవో శ్రీనివాసరావు సిబ్బందిని ఆదేశించారు. తొక్కిసలాట జరగకుండా పోలీస్ శాఖతో సమన్వయం చేసుకోవాలన్నారు. క్యూలైన్లు, పాతాళగంగ తదితర ప్రదేశాలను పరిశీలించి పలు సూచనలు చేశారు.
News March 18, 2025
రేపు, ఎల్లుండి జాగ్రత్త

AP: మార్చిలోనే ఎండలు మండిపోతున్నాయి. రేపు 58 మండలాల్లో, ఎల్లుండి 37 మండలాల్లో వడగాలులు వీస్తాయని <
News March 18, 2025
కావలి గ్రీష్మ రాజీనామాకు ఆమోదం

AP: ఏపీ మహిళా కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్‌పర్సన్ పదవికి కావలి గ్రీష్మ ఈ నెల 9న రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా తన పేరును ప్రకటించగానే ఆమె రాజీనామా చేశారు. ఇటీవల ఆమె ఆ కోటాలో MLCగా ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రభుత్వం గ్రీష్మ రాజీనామాను ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.