News August 25, 2024

30న ‘తుంబాడ్’ రీరిలీజ్

image

ఇండియన్ సినిమా హిస్టరీలో మోస్ట్ అండర్‌రేటెడ్ హారర్ మూవీ ‘తుంబాడ్’ ఈ నెల 30న దేశవ్యాప్తంగా రీరిలీజ్ కానుంది. రాహీ అనిల్ బార్వే డైరెక్షన్‌లో మరాఠీ, హిందీలో తెరకెక్కిన ఈ చిత్రం 2018లో విడుదలైంది. అప్పట్లో ఈ మూవీని ఎవరూ పట్టించుకోలేదు. తర్వాత పలు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్, యూట్యూబ్‌లో మంచి క్రేజ్‌ను సాధించింది. స్టోరీ, స్క్రీన్ ప్లే, విజువల్స్‌కు మంచి మార్కులు పడ్డాయి.

Similar News

News December 4, 2025

భారత్ ఓటమికి కారణమిదే..

image

సౌతాఫ్రికాతో రెండో వన్డేలో భారత్ <<18462441>>ఓటమికి<<>> చెత్త ఫీల్డింగ్, పేలవ బౌలింగే కారణం. మార్క్రమ్ క్యాచ్‌ను జైస్వాల్ వదిలేయడంతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. అతడు సెంచరీతో చెలరేగాడు. ప్రసిద్ధ్ 8.2 ఓవర్లకు 82, కుల్దీప్ 10 ఓవర్లకు 78, హర్షిత్ 10 ఓవర్లకు 70 రన్స్ సమర్పించుకోవడం భారత్‌కు విజయాన్ని దూరం చేసింది. ఇక ఇలాంటి ఫీల్డింగ్‌తో 400 కొట్టినా కాపాడుకోలేమని క్రికెట్ ఫ్యాన్స్ సెటైర్లు వేస్తున్నారు.

News December 4, 2025

సీఎం చంద్రబాబుతో అదానీ భేటీ

image

ఏపీ సీఎం చంద్రబాబుతో అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ, అదానీ పోర్ట్స్&SEZ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కరణ్ అదానీ భేటీ అయ్యారు. అమరావతిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. రాష్ట్రంలో అదానీ గ్రూపు చేపట్టిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, రానున్న రోజుల్లో పెట్టబోయే పెట్టుబడులపై చర్చించినట్లు సీఎం ట్వీట్ చేశారు. ఈ మీటింగ్‌లో మంత్రి లోకేశ్ కూడా పాల్గొన్నారు.

News December 3, 2025

IND vs SA.. రెండో వన్డేలో నమోదైన రికార్డులు

image

☛ వన్డేల్లో ఇది మూడో అత్యధిక ఛేజింగ్ స్కోర్ (359)
☛ వన్డేల్లో కోహ్లీ వరుసగా 2 మ్యాచుల్లో సెంచరీ చేయడం ఇది 11వ సారి
☛ SAపై అత్యధిక సెంచరీలు (7) చేసిన ప్లేయర్‌గా కోహ్లీ రికార్డు
☛ 77 బంతుల్లో రుతురాజ్ సెంచరీ.. సౌతాఫ్రికాపై వన్డేల్లో ఇండియా బ్యాటర్‌కు ఇది రెండో ఫాస్టెస్ట్ సెంచరీ. Y పఠాన్ (68బాల్స్) తొలి స్థానంలో ఉన్నారు.
☛ సచిన్ 34 వేర్వేరు వేదికల్లో ODI సెంచరీలు చేశారు. దానిని కోహ్లీ సమం చేశారు.