News August 25, 2024
30న ‘తుంబాడ్’ రీరిలీజ్

ఇండియన్ సినిమా హిస్టరీలో మోస్ట్ అండర్‌రేటెడ్ హారర్ మూవీ ‘తుంబాడ్’ ఈ నెల 30న దేశవ్యాప్తంగా రీరిలీజ్ కానుంది. రాహీ అనిల్ బార్వే డైరెక్షన్‌లో మరాఠీ, హిందీలో తెరకెక్కిన ఈ చిత్రం 2018లో విడుదలైంది. అప్పట్లో ఈ మూవీని ఎవరూ పట్టించుకోలేదు. తర్వాత పలు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్, యూట్యూబ్‌లో మంచి క్రేజ్‌ను సాధించింది. స్టోరీ, స్క్రీన్ ప్లే, విజువల్స్‌కు మంచి మార్కులు పడ్డాయి.
Similar News
News March 9, 2026
ఇరాన్‌పై దాడులు.. ఆ ఒక్క దీవిని US టచ్ చేయట్లేదు!

ఇరాన్‌పై ఇజ్రాయెల్‌తో కలిసి అమెరికా భీకర దాడులకు పాల్పడుతున్నా ఆ దేశంలోని ఖర్గ్ దీవిని మాత్రం టచ్ చేయట్లేదు. ఇరాన్ తీరానికి 25KM దూరంలో ఉన్న దీవి భారీ చమురు నిల్వలకు నిలయం. ఒక్కరోజే ఇక్కడ 7M బ్యారెళ్ల చమురును భద్రపరచొచ్చు. ఇరాన్ క్రూడ్ ఎగుమతుల్లో ఈ దీవి వాటా 90%. దీని మీద దాడి చేస్తే ఇరాన్‌కే కాకుండా గల్ఫ్ మొత్తానికి భారీ నష్టం వాటిల్లుతుంది. చమురు సరఫరా వ్యవస్థ దెబ్బతిని ధరలు భారీగా పెరుగుతాయి.
News March 9, 2026
ఆ తేదీల్లో రికమండేషన్ లెటర్లు అంగీకరించం: TTD

AP: తిరుమల ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, ఉగాది ఆస్థానం సందర్భంగా ఈ నెల 17, 19 తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు TTD తెలిపింది. ఈ క్రమంలో 16, 18 తేదీల్లో ఎంపీ, ఎమ్మెల్యేల రికమండేషన్ లెటర్లు అంగీకరించబోమని పేర్కొంది. అయితే వీఐపీ ప్రొటోకాల్ దర్శనాలు యథావిధిగా కొనసాగుతాయని చెప్పింది.
News March 9, 2026
ChatGPTని అడిగి అమ్మాయిల సూసైడ్?.. మస్క్ రియాక్షన్ ఇదే

సూరత్(గుజరాత్)లో షాకింగ్ ఘటన జరిగింది. ‘ఎలా చనిపోవాలి? ఏ మందులు వాడాలి?’ అని ChatGPTలో అడిగి ఇద్దరు అమ్మాయిలు(18, 20ఏళ్లు) సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని ఓ వ్యక్తి Xలో పోస్టు చేయగా ఎలాన్ మస్క్ yikes(ప్రమాదకరం, షాకింగ్) అంటూ రిప్లై ఇచ్చారు. అయితే ChatGPT, Gemini Ai సూసైడ్ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వట్లేదని పలువురు గుర్తుచేస్తున్నారు.


