News June 14, 2024
ఏపీలో రేపు పిడుగులతో కూడిన వర్షాలు
AP: ద్రోణి ప్రభావంతో శనివారం రాష్ట్రంలో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
Similar News
News September 20, 2024
రేపు పండితులతో సీఎం చంద్రబాబు సమావేశం
AP: తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడటంపై శాస్త్రాల పరంగా తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం ఫోకస్ చేసింది. రేపు ఆగమ, వైదిక పరిషత్‌లతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. ఆలయ శుద్ధి అవసరమా? తదితర అంశాలపై పండితులు ఇచ్చే సూచనలు, సలహాలతో తదుపరి చర్యలు తీసుకోనున్నారు.
News September 20, 2024
పంచామృతంలో ఏఆర్ డెయిరీ నెయ్యి వాడట్లేదు: TN ప్రభుత్వం
AP: తిరుమలకు నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డెయిరీపై తమిళనాడు ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పళని సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలోని పంచామృతంలో ఏఆర్ డెయిరీ నెయ్యి వాడుతున్నారన్న ప్రచారం అవాస్తవమని తెలిపింది. ఆవిన్ నెయ్యి వాడుతున్నట్లు వెల్లడించింది. కాగా ఇప్పటికే ఏఆర్ డెయిరీపై ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.
News September 20, 2024
జీతాలు పెంపు.. ఆరోగ్య మిత్రల సమ్మె విరమణ
TG: కొన్ని రోజులుగా చేస్తున్న సమ్మె విరమిస్తున్నట్లు ఆరోగ్య మిత్రలు వెల్లడించారు. మంత్రి దామోదర రాజనర్సింహతో జరిపిన చర్చలు ఫలించాయి. క్యాడర్ మార్పు, వేతనం రూ.15,600 నుంచి రూ.19,500కు పెంచేందుకు ప్రభుత్వం అంగీకరించింది. దీంతో సమ్మె విరమిస్తూ వారు లేఖ విడుదల చేశారు. రేపటి నుంచి యథావిధిగా ఆరోగ్య శ్రీ సేవల విధుల్లో పాల్గొంటామని ప్రకటించారు. మంత్రి దామోదరకు ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలిపారు.