News March 13, 2025

అమెరికా మాజీ అధ్యక్షుడి నిర్మాణంలో ‘టైగర్ వుడ్స్’ బయోపిక్

image

స్టార్ గోల్ఫర్ టైగర్ వుడ్స్ జీవితంపై బయోపిక్ తెరకెక్కనున్నట్లు సమాచారం. ‘వెరైటీ’ మ్యాగజైన్ కథనం ప్రకారం.. US మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా దంపతులు ఆ సినిమాను నిర్మిస్తారు. వుడ్స్ జీవితంపై కెవిన్ కుక్ అనే రచయిత రాసిన పుస్తకం ఆధారంగా ఈ సినిమా స్క్రీన్‌ప్లే ఉండనుంది. గోల్ఫ్ ప్రపంచంలో తిరుగులేని రారాజుగా ఓ వెలుగు వెలిగిన వుడ్స్, ఆ తర్వాత వివాహేతర సంబంధాలు సహా పలు వివాదాల్లో చిక్కుకున్నారు.

Similar News

News March 27, 2026

హమ్మయ్యా.. పెట్రోల్ బంకుల వద్ద రద్దీ తగ్గింది!

image

HYDలో పలు పెట్రోల్ బంకుల వద్ద పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నాయి. యుద్ధం ప్రభావంతో బంకులు మూసివేస్తారన్న భయాందోళనతో గత 3రోజులుగా బంకుల వద్ద రద్దీ నెలకొంది. కొరత లేదని ప్రభుత్వం చెప్పడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఇంధన సరఫరాను రెగ్యులర్ స్థాయి కంటే భారీగా పెంచామని, కృత్రిమ కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. నిన్న HP 17L ltr పెట్రోల్, 13L ltr డీజిల్ సరఫరా చేసింది.

News March 27, 2026

దారుణం: బిడ్డ ఏడుస్తోందని..

image

AP: బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లిదండ్రులే క్షణికావేశం, అక్రమ సంబంధాలతో వారి ప్రాణాలు తీస్తున్నారు. తిరుపతి(D) నరసరాజు అగ్రహారంలో 5 నెలల కూతురు ఏడుస్తోందని తల్లి హేమావతి చంపేసింది. ఆ తర్వాత భర్తకు ఫోన్ చేసి ‘నీకో బ్యాడ్ న్యూస్. నాకో గుడ్ న్యూస్. పాపను చంపేశా’ అని చెప్పినట్లు సమాచారం. మార్కాపురం(D) త్రిపురాంతకంలో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని కూతురు తులసి(9)ని తండ్రే హతమార్చాడు.

News March 27, 2026

‘శ్రీరామ’ అంటే అదే పుణ్య మంత్రం

image

శ్రీరామనవమి రోజున రామనామస్మరణం చేయాలని చెబుతుంటారు. రామ నామమును తారకమంత్రమని కూడా అంటారు. తారకమంత్రమంటే దేన్నైనా తేలికగా దాటించేది అని అర్థం. ఏ మంత్రము చెప్పినా దానిముందు ఓం అని.. తర్వాత నమః అని కచ్చితంగా వాడాలి. కానీ రామ నామానికి అలాంటి నియమాలేవీ లేవు. శ్రీరామ అంటే అదే పుణ్య మంత్రం. రామనామంతో ధ్యానం చేయడం వల్ల సకల పాపాలు తొలిగిపోతాయి.