News January 24, 2025

భారత భవిష్యత్ కెప్టెన్‌ తిలక్ వర్మ: బ్రాడ్ హగ్

image

భారత T20 జట్టుకు భవిష్యత్ కెప్టెన్‌ తిలక్ వర్మ అని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హగ్ అన్నారు. అతని బ్యాటింగ్ అంటే తనకెంతో ఇష్టమని చెప్పారు. తిలక్ వర్మ స్మార్ట్ క్రికెటర్ అని, అతని క్రికెట్ బ్రెయిన్ సూపర్ అన్నారు. అందుకే భవిష్య కెప్టెన్‌గా ఎదుగుతారని తెలిపారు. 2023 ఆగస్టులో వెస్టిండీస్‌పై T20 సిరీస్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన తిలక్ ఇప్పటి వరకు 21మ్యాచులు ఆడి 635 రన్స్ చేశారు.

Similar News

News December 8, 2025

హీరోయిన్‌కు వేధింపులు.. మలయాళ నటుడిని నిర్దోషిగా తేల్చిన కోర్టు

image

హీరోయిన్‌పై లైంగిక వేధింపుల కేసులో మలయాళ నటుడు దిలీప్‌ను కోర్టు నిర్దోషిగా తేల్చింది. ఈ మేరకు కేరళలోని ఎర్నాకులం జిల్లా సెషన్స్ కోర్టు తీర్పునిచ్చింది. ఆరుగురు నిందితులను దోషులుగా నిర్ధారించింది. వారికి శిక్షను ఈనెల 12న ప్రకటించనుంది. 2017లో సినీ నటిపై వేధింపుల కేసులో దిలీప్ అరెస్టయ్యారు. కొన్నాళ్లు జైలు జీవితం గడిపారు. దాదాపు 8 ఏళ్ల పాటు ఈ కేసు విచారణ జరిగింది.

News December 8, 2025

ఇండిగో సంక్షోభం.. అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నో

image

ఇండిగో విమానాల సంక్షోభంపై అత్యవసర విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రభుత్వం ఇప్పటికే దీనిపై చర్యలు తీసుకుంటోందని తెలిపింది. ఈ సమయంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. అయితే ఇది తీవ్రమైన సమస్య అని, లక్షలాది మంది బాధితులు ఉన్నారని ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. కాగా విమానాల రద్దుపై ఈ పిల్ దాఖలైంది.

News December 8, 2025

రూ.7,887 కోట్లు అకౌంట్లలో జమ

image

TG: వరి సేకరణలో దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ కొనసాగుతోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 41.6 లక్షల టన్నుల వరి కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. 8,401 PPCలలో 7.5 లక్షల మంది రైతులకు 48 గంటల్లోనే రూ.7,887 కోట్లు చెల్లించామని తెలిపారు. వరి కొనుగోళ్లలో 45% ఐకేపీ మహిళల భాగస్వామ్యంతో మహిళా సాధికారతకు కట్టుబడి ఉన్నామని మంత్రి పేర్కొన్నారు.