News September 6, 2024
తిరుమలలో మళ్లీ ‘తిలక ధారణ’
తిరుమలలో దాదాపు 4ఏళ్ల తర్వాత తిలక ధారణ కార్యక్రమం మళ్లీ ప్రారంభమైంది. దీన్ని టీటీడీ ఈవో శ్యామలరావు పున:ప్రారంభించారు. తిరుమలలోని ఏటీసీ, సుపథం, వరాహస్వామి ఆలయం, కళ్యాణకట్ట, VQC ఎంట్రీలు, రూ.300 లైన్, KKC మెయిన్ వద్ద నిరంతరాయంగా తిలక ధారణ అందుబాటులో ఉంటుందని చెప్పారు. కాగా కరోనా వల్ల ఈ కార్యక్రమాన్ని టీటీడీ గతంలో నిలిపివేసింది. తాజాగా పున:ప్రారంభించింది.
Similar News
News October 4, 2024
మహిళలపై నేరాలు చూడలేక కళ్లు మూసుకున్న దుర్గామాత విగ్రహం వైరల్
ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనను నిరసిస్తూ కోల్‌కతాలో దసరా ఉత్సవాల నిర్వాహకులు ఓ మండపంలో ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహం ఆలోచింపజేస్తోంది. జీవచ్ఛవంలా పడి ఉన్న బాధితురాలిని చూడలేక దుర్గామాత కళ్లు మూసుకున్నట్టు, సింహం సిగ్గుతో తలదించుకున్నట్టు విగ్రహాల్ని ఏర్పాటు చేశారు. మహిళలపై నేరాలకు నిరసనగా ఏర్పాటు చేసిన ఈ మండపం ‘లజ్జా’ (అవమానం) ఇతివృత్తంతో ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు తెలిపారు.
News October 4, 2024
అందుకే పాక్ కంటే ఇంగ్లండ్ బెటర్: పాక్ క్రికెటర్
ఇంగ్లండ్ ప్రొఫెషనల్ క్రికెట్ అద్భుతంగా ఉంటుందని పాక్ క్రికెటర్ మొహమ్మద్ అబ్బాస్ తెలిపారు. జీతాలు, బట్టలు, ఆహారం అన్నీ పాకిస్థాన్ కంటే బెటర్‌గా అందిస్తుందని చెప్పారు. ‘క్వీన్ ఎలిజబెత్ చనిపోయినా ఇంగ్లండ్ క్రికెట్ షెడ్యూల్ మార్చలేదు. ఆటగాళ్లకు సంపూర్ణ మద్దతు ఇస్తుంది. కానీ పాక్‌లో ఇలాంటి పరిస్థితులు లేవు. పీసీబీ చెప్పినట్లే నడుచుకోవాలి. అందుకే కౌంటీల్లో ఆడేందుకే నా ప్రాధాన్యం’ అని ఆయన చెప్పుకొచ్చారు.
News October 4, 2024
దసరాకు ప్రత్యేక రైళ్లు
దసరా సెలవుల నేపథ్యంలో పెరిగిన ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నెల 15 వరకు 644 ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయని తెలిపింది. సికింద్రాబాద్, కాచిగూడ, మహబూబ్ నగర్, తిరుపతి రైల్వే స్టేషన్ల నుంచి ముఖ్యమైన రూట్లలో ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపింది.