News March 28, 2024

‘టిల్లు స్క్వేర్’ ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్?

image

హీరో సిద్ధు జొన్నలగడ్డ, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కాంబోలో తెరకెక్కిన ‘టిల్లు స్క్వేర్’ మూవీ ఓటీటీ పార్ట్‌నర్‌ను ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ రైట్స్ దక్కించుకున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మల్లిక్ రామ్ తెరకెక్కించిన ఈ మూవీలో మురళీ శర్మ, ప్రిన్స్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా రేపు థియేటర్లలో విడుదల కానుంది.

Similar News

News February 18, 2026

NCERTలో 117 పోస్టులు.. దరఖాస్తు గడువు పెంపు

image

NCERTలో 117 అకడమిక్ పోస్టులకు దరఖాస్తు చేయడానికి గడువును పెంచారు. FEB 20 ఆఖరు తేదీ కాగా.. మార్చి 6 వరకు పొడిగించారు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో PG, M.LSc, NET/SET/SLET, PhD/M.Phil అర్హతతో పాటు టీచింగ్/ రీసెర్చ్ అనుభవం ఉండాలి. ప్రొఫెసర్‌కు నెలకు రూ.1,44,200, అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.1,31,400, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ లైబ్రేరియన్‌కు రూ.57,700 చెల్లిస్తారు. వెబ్‌సైట్: www.ncert.nic.in

News February 18, 2026

యూట్యూబ్ డౌన్.. స్పందించిన టీమ్

image

ప్రపంచ వ్యాప్తంగా YouTube డౌన్ అయినట్లు ఆ కంపెనీ ధ్రువీకరించింది. లక్షలాది ఫిర్యాదుల మేరకు ట్విటర్ వేదికగా స్పందించింది. తమ సేవల పునరుద్ధరణకు ఇప్పటికే చర్యలు చేపట్టినట్లు వివరించింది. ఈ ఉదయం 6.18గంటల నుంచి 7.33గంటల మధ్య యూట్యూబ్ పని చేయలేదు. అటు ప్రస్తుతం కొందరికి YouTube సేవలు అందుతుండగా మరికొందరు ఫోన్ లేదా వెబ్‌సైట్‌లో యాక్సెస్ చేయలేకపోతున్నారు.

News February 18, 2026

భార్యాభర్తల నడుమ అనురాగం పెరగాలంటే?

image

వాస్తు నిపుణుల సూచన ప్రకారం.. ఇంటి గదులులో లేత రంగులో ఉండాలి. తక్కువ కాంతినిచ్చే దీపాలతో సానుకూలత పెరుగుతుంది. పడుకునే మంచం చెక్కతో చేసినదై ఉండాలి. స్టీల్/ఐరన్ మంచాలు ప్రతికూల శక్తిని కలిగిస్తాయి. గదిలో అద్దాలు ఉండకపోవడం ఉత్తమం. ఒకవేళ ఉన్నా.. మూసి ఉంచడం మంచిది. గదిని శుభ్రంగా ఉంచుకోవాలి. చిన్న చిన్న విషయాల్లో సర్దుకుపోవాలి. ఇలా అయితేనే గొడవలు తగ్గుతాయి. బంధం బలపడుతుంది.