News May 10, 2024

ఆ యూట్యూబ్ ఛానల్స్‌ను నియంత్రించాల్సిన సమయం వచ్చింది: కోర్టు

image

నియంత్రణ లేకుండా సమాజానికి విఘాతం కలిగించేలా ప్రసారాలు చేస్తోన్న యూట్యూబ్ ఛానల్స్‌ను నియంత్రించాల్సిన సమయం వచ్చిందని మద్రాసు హైకోర్టు వ్యాఖ్యానించింది. యూట్యూబర్ ఫెలిక్స్ జెరాల్డ్ నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో సవుక్కు శంకర్ అనే వ్యక్తి మహిళా పోలీసు సిబ్బందిపై అవమానకర ప్రకటనలు చేశారు. దీనిపై కేసు నమోదు కాగా ఫెలిక్స్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను విచారించిన కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

Similar News

News December 25, 2024

బాక్సింగ్ డే టెస్టుల్లో సెంచరీలు బాదింది వీరే

image

ఇప్పటివరకు ఆస్ట్రేలియాలో జరిగిన బాక్సింగ్ డే టెస్టుల్లో ఐదుగురు భారత బ్యాటర్లు మాత్రమే శతకాలు నమోదు చేశారు. సచిన్ టెండూల్కర్ (1999), వీరేంద్ర సెహ్వాగ్ (2003), అజింక్య రహానే, విరాట్ కోహ్లీ (2014), చటేశ్వర్ పుజారా (2018), అజింక్య రహానే (2020) సెంచరీలు చేశారు. రహానే రెండు సార్లు శతకాలు సాధించారు. మరి రేపు ప్రారంభం కాబోయే బాక్సింగ్ డే టెస్టులో ఎవరు సెంచరీ బాదుతారో కామెంట్ చేయండి.

News December 25, 2024

ప్రజలను వణికిస్తోన్న చలి పులి

image

రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటే వణికిపోతున్నారు. రానున్న రెండు రోజుల్లో దీని తీవ్రత మరింత పెరిగే అవకాశముందని ఐఎండీ తెలిపింది. TGలోని కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్‌లో 5.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే హైదరాబాద్‌లో 11.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అటు APలోనూ సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

News December 25, 2024

రేపు సెలవు

image

తెలంగాణలో రేపు కూడా స్కూళ్లకు సెలవు ఉండనుంది. క్రిస్మస్ సందర్భంగా ఈరోజు, రేపు ప్రభుత్వం పబ్లిక్ హాలిడే ప్రకటించింది. అటు ఏపీ ప్రభుత్వం ఇవాళ ఒక్కరోజే పబ్లిక్ హాలిడే ఇవ్వగా, రేపు ఆప్షనల్ హాలిడే అని తెలిపింది. అంటే అక్కడి పరిస్థితులను బట్టి జిల్లా విద్యాధికారులు సెలవు ఇవ్వడంపై నిర్ణయం తీసుకుంటారు. ఈమేరకు సెలవు ఉండేది, లేనిది ఇప్పటికే విద్యార్థులకు సమాచారం అందించారు.