News February 18, 2025
తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం.. నిందితులకు ముగిసిన విచారణ

AP: తిరుమల శ్రీవారి లడ్డూలో ఉపయోగించే నెయ్యి కల్తీ కేసులో నలుగురు నిందితులకు కోర్టు విధించిన 5 రోజుల కస్టడీ ముగిసింది. సిట్ తాత్కాలిక కార్యాలయంలో వారి విచారణ జరగ్గా, ఇవాళ రుయా ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం తిరుపతి 2వ అదనపు మేజిస్ట్రేట్ కోర్టు జడ్జి ఎదుట హాజరుపర్చారు. నిందితులు విచారణకు సహకరించట్లేదని, మరికొన్ని రోజులు కస్టడీ పొడిగించాలని సిట్ అధికారులు కోరినట్లు సమాచారం.
Similar News
News April 17, 2026
పాడి పశువులను కొనే ముందు జాగ్రత్తలు

పాడి పశువును కొనే సమయానికి అది 2వ ఈతలో ఉండాలి. ఏ సమస్యా లేకుండా ఈనిన ఆరోగ్యమైన పశువును 15 రోజుల లోపు కొనుగోలు చేయాలి. ధరను పాల ఉత్పత్తిని బట్టి నిర్ణయించాలి. పశువును కొనేముందు మొదటిసారి తీసిన పాలను లెక్కలోకి తీసుకోకూడదు. రెండో రోజు ఉదయం, సాయంత్రం తీసిన పాలను లెక్కలోకి తీసుకోవాలి. లీటరు డబ్బాలతో పాలను కొలవాల్సి వస్తే పాలపై నురగని పూర్తిగా తీసివేయాలి. అన్ని పశువులను ఒకేసారి కొనకపోవడం మంచిది.
News April 17, 2026
మహిళా బిల్లు చదరంగం: ఎవరి ఎత్తులు వారివే!

మహిళా రిజర్వేషన్ల అమలుపై అధికార, ప్రతిపక్షాల వ్యూహాలు పతాక స్థాయికి చేరాయి. రిజర్వేషన్లను డీలిమిటేషన్‌తో ముడిపెట్టడం ద్వారా ప్రతిపక్షాలను ఇరకాటంలో పెట్టాలని BJP ప్లాన్ వేసింది. బిల్లును అడ్డుకుంటే ‘మహిళా వ్యతిరేకులు’గా ముద్ర వేయొచ్చన్నది అధికార పక్షం ప్లాన్. దీనికి విపక్షాలు ‘కుల గణన’ అస్త్రంతో కౌంటర్ ప్లాన్ రెడీ చేసుకున్నాయి. OBC కోటా లేని రిజర్వేషన్లు అసంపూర్ణమంటూ BJPకి కౌంటరిస్తున్నాయి.
News April 17, 2026
మహిళా బిల్లుకు గతంలోనే మద్దతిచ్చాం: CBN

AP: ఉమెన్ రిజర్వేషన్ బిల్లుకు పూర్తి మద్దతు పలుకుతున్నామని CM చంద్రబాబు TDP ఆఫీసులో మీడియాతో పేర్కొన్నారు. ‘గతంలో పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు మద్దతు ప్రకటించాం. కొన్ని కారణాలతో అప్పుడది కార్యరూపం దాల్చలేదు’ అని వివరించారు. ఈసారైనా బిల్లు నెగ్గి అమలవుతుందా? అని మీడియా ప్రశ్నించగా ‘మహిళా బిల్లు ఆమోదం పొందితే మీరు వంటింట్లో పని చేయాల్సి వస్తుందని భయపడుతున్నారా’ అని CBN వ్యాఖ్యానించారు.


