News September 22, 2024

తిరుమల నెయ్యి వివాదం.. పోలీసులకు ‘అమూల్’ ఫిర్యాదు

image

తిరుమలకు లడ్డూ ప్రసాద తయారీకి తాము కల్తీ నెయ్యిని పంపినట్లు కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని గుజరాత్‌లో అమూల్ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొంది. దీనిపై పోలీసులు FIR నమోదు చేశారు. తాము ఇప్పటివరకు టీటీడీకి ఆవు నెయ్యి సప్లై చేయలేదని అమూల్ స్పష్టం చేసింది.

Similar News

News September 22, 2024

విచారణ జరగాలి.. దోషులను శిక్షించాలి: పవన్

image

AP: తిరుమలలో జరిగిన ఘటన భవిష్యత్తులో మళ్లీ జరగకుండా NDA ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని Dy.CM పవన్ హామీ ఇచ్చారు. ‘దీనిపై CBIతో విచారణ జరిపించడంపై క్యాబినెట్‌లో చర్చిస్తాం. దీనిపై నిర్ణయం తీసుకోవాలని సీఎం చంద్రబాబును కోరుతున్నా. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా మా మద్దతు ఉంటుంది. వైసీపీ హయాంలో టీటీడీలో జరిగిన అక్రమాలు, అపచారాలపై విచారణ జరగాలి. దోషులను శిక్షించాలి’ అని అన్నారు.

News September 22, 2024

ఖడ్గమృగాల దినోత్సవం.. మోదీ స్పెషల్ ట్వీట్

image

ప్రపంచ ఖడ్గమృగాల దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు పంచుకున్నారు. ‘అత్యంత ప్రసిద్ధ జాతులలో ఒకటైన ఖడ్గమృగాలను రక్షించడానికి మన నిబద్ధతను పునరుద్ఘాటిద్దాం. ఏళ్లుగా ఖడ్గమృగాల సంరక్షణ ప్రయత్నాలలో పాలుపంచుకున్న వారందరికీ అభినందనలు. దేశంలో అత్యధికంగా ఖడ్గమృగాలు కలిగి ఉండటం గర్వించదగ్గ విషయం. వీటిని చూసేందుకు కజిరంగా ఫారెస్ట్‌ను అంతా సందర్శించండి’ అని తెలిపారు.

News September 22, 2024

చర్చిలో అపవిత్రం జరిగితే జగన్ ఊరుకుంటారా?: పవన్

image

తిరుమలలో జరిగినట్లు చర్చి/మసీదులో ఏదైనా అపవిత్రత చోటుచేసుకుంటే దేశమంతా అల్లకల్లోలం చేసేవారని, ప్రపంచమంతా తెలిసేదని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. ‘మేము అన్ని మతాలను గౌరవిస్తాం. కానీ ఈ వివాదంపై మాట్లాడొద్దంటే ఎలా? దీని వల్ల కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇదే చర్చి/మసీదులో జరిగితే మాజీ సీఎం జగన్ ఊరుకుంటారా? దోషులను ఎందుకు వెనకేసుకొస్తున్నారు? ‘ అని ఫైరయ్యారు.