News January 28, 2025

TIRUMALA: స్వల్పంగా పెరిగిన రద్దీ

image

తిరుమలలో భక్తుల రద్దీ నిన్నటితో పోలిస్తే స్వల్పంగా పెరిగింది. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 8 గంటలు పడుతోంది. ప్రస్తుతం 4 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న స్వామివారిని 65,278మంది భక్తులు దర్శించుకున్నారని అధికారులు తెలిపారు. 22,077మంది తలనీలాలు సమర్పించారని, హుండీకి రూ.3.70 కోట్ల ఆదాయం సమకూరిందని వెల్లడించారు.

Similar News

News September 19, 2025

టీడీపీలోకి మాజీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్

image

AP: మాజీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ ఇవాళ సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. ఆయనతో పాటు చిలకలూరిపేటకు చెందిన పలువురు వైసీపీ నేతలు టీడీపీ కండువా కప్పుకోనున్నారు. మాజీ మంత్రి విడదల రజినితో విభేదాల కారణంగా ఇప్పటికే ఆయన వైసీపీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. గతంలో చిలకలూరిపేట ఎమ్మెల్యేగా ఎన్నికైన రాజశేఖర్ వైసీపీ రీజినల్ కో ఆర్డినేటర్‌గానూ పనిచేశారు.

News September 19, 2025

బొప్పాయిలో రింగ్ స్పాట్ వైరస్ – లక్షణాలు

image

రింగ్ స్పాట్ వైరస్ సోకిన బొప్పాయి చెట్ల లేత ఆకులు పసుపు పచ్చగా మారతాయి. ఆకుల ఈనెలు వంగి ముడుచుకుపోతాయి. పూత, పిందె, కాయ, పండ్లపై గోధుమ రంగులో ఉంగరాల్లాంటి రింగుల మచ్చలు ఏర్పడతాయి. ఆ రింగు మధ్య బాగం ఆకుపచ్చగా ఉంటుంది. తెగులు సోకిన పూలు.. పిందెగా మారవు. పిందెలు ఎదగవు. కాయలు తొందరగా పండిపోయి మెత్తగా మారి నీరు కారినట్లు అవుతాయి. ఈ మచ్చల వల్ల పండ్లు నాణ్యత కోల్పోయి మార్కెట్‌లో పంటకు సరైన ధర దక్కదు.

News September 19, 2025

23 సీట్లే వచ్చినా చంద్రబాబు అసెంబ్లీకి వచ్చారు: పల్లా

image

AP: అసెంబ్లీలో ప్రతిపక్షం లేకపోవడం బాధగానే ఉందని TDP రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు అన్నారు. జగన్ ప్రజా తీర్పును గౌరవించాలని, ఎమ్మెల్యేల సంఖ్య ముఖ్యం కాదని చెప్పారు. ఎమ్మెల్యేల బలం లేకపోయినా ప్రతిపక్ష హోదా ఇవ్వాలనడం సరికాదన్నారు. 2019లో 23 సీట్లే వచ్చినా చంద్రబాబు అసెంబ్లీకి వచ్చారని తెలిపారు. అసెంబ్లీలో మాట్లాడకుండా ప్రెస్‌మీట్‌లలో మాట్లాడతామనడం సరికాదని హితవు పలికారు.