News January 28, 2025

TIRUMALA: స్వల్పంగా పెరిగిన రద్దీ

image

తిరుమలలో భక్తుల రద్దీ నిన్నటితో పోలిస్తే స్వల్పంగా పెరిగింది. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 8 గంటలు పడుతోంది. ప్రస్తుతం 4 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న స్వామివారిని 65,278మంది భక్తులు దర్శించుకున్నారని అధికారులు తెలిపారు. 22,077మంది తలనీలాలు సమర్పించారని, హుండీకి రూ.3.70 కోట్ల ఆదాయం సమకూరిందని వెల్లడించారు.

Similar News

News February 8, 2025

వైభవంగా అంతర్వేదిలో కళ్యాణోత్సవం

image

AP: అంబేడ్కర్ కోనసీమ(D)లోని అంతర్వేదిలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. అర్ధరాత్రి 12.55 గంటలకు మృగశిరా నక్షత్రయుక్త వృశ్చిక లగ్నంలో శ్రీదేవి భూదేవి అమ్మవార్లతో స్వామివారికి అర్చకులు వివాహం జరిపించారు. ఈ వేడుకను వీక్షించేందుకు దాదాపు 2-3 లక్షల మంది భక్తులు తరలివచ్చినట్లు అంచనా.

News February 8, 2025

ఫిబ్రవరి 8: చరిత్రలో ఈరోజు

image

✒ 1897: మాజీ రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్ జననం(ఫొటోలో)
✒ 1902: సుప్రసిద్ధ కవి ఆండ్ర శేషగిరిరావు జననం
✒ 1934: ప్రముఖ జర్నలిస్ట్ పొత్తూరి వెంకటేశ్వర రావు జననం
✒ 1941: గజల్ గాయకుడు జగ్జీత్ సింగ్ జననం
✒ 1957: నటి వై.విజయ జననం
✒ 1963: IND మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ జననం(ఫొటోలో)

News February 8, 2025

BPL-2025 విజేత ఫార్చూన్ బారిషల్

image

బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్-2025 ఎడిషన్ విజేతగా ఫార్చూన్ బారిషల్ నిలిచింది. ఫైనల్‌లో చిట్టగాంగ్ కింగ్స్‌పై 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత చిట్టగాంగ్ 194/3 స్కోర్ చేయగా బారిషల్ 19.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. ఆ జట్టుకు వరుసగా రెండో టైటిల్ కావడం విశేషం. విజేతకు రూ.2.50 కోట్ల ప్రైజ్ మనీ లభించింది. BPLలో మొత్తం ఏడు టీమ్‌లు పాల్గొన్న విషయం తెలిసిందే.

error: Content is protected !!