News March 24, 2024
రేపటి నుంచి తిరుపతమ్మ చిన తిరునాళ్లు

AP: NTR(D) పెనుగంచిప్రోలు తిరుపతమ్మ ఆలయంలో చిన తిరునాళ్లు రేపటి నుంచి నిర్వహించనున్నారు. 29వ తేదీ వరకు జరిగే ఈ వేడుకకు ఏపీ, తెలంగాణ నుంచి భక్తులు భారీగా తరలిరానున్నారు. రేపు ఉదయం 6 గంటలకు అఖండజ్యోతి స్థాపనతో తిరునాళ్లు ప్రారంభం కానుండగా.. 26న రథోత్సవం, తిరుపతమ్మ, గోపయ్య స్వాములను గ్రామంలో ఊరేగిస్తారు. 27న దివ్యప్రభోత్సవం, 28న పసుపు కుంకుమ బండ్ల ఉత్సవం, 29న బోనాల సమర్పణతో తిరునాళ్లు ముగుస్తాయి.
Similar News
News April 20, 2025
ఎంఐఎం నేతలు విషసర్పాల కంటే ప్రమాదం: బండి

TG: వక్ఫ్ ఆస్తులను దోచుకున్న దొంగలంతా నిన్న హైదరాబాద్‌లో ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. ఎంఐఎం పార్టీ నేతలు విష సర్పాల కంటే ప్రమాదమని మండిపడ్డారు. ఒవైసీ మీటింగ్‌కు స్పాన్సర్ రేవంత్ ప్రభుత్వమేనని ఆరోపించారు. మరోవైపు రాష్ట్రంలో వడగళ్ల వానతో పంటలు దెబ్బతిన్నాయన్నారు. వెంటనే పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
News April 20, 2025
IPL: టాస్ గెలిచిన RCB

ముల్లాన్‌పూర్‌లో PBKSvsRCB మ్యాచ్‌లో RCB టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. మొన్న తమ సొంత గ్రౌండ్‌లో వర్షం కారణంగా కుదించిన మ్యాచ్‌లో RCB ఓటమిపాలైంది. దీంతో ఈ మ్యాచ్ పోటాపోటీగా ఉండొచ్చు.
PBKS: ప్రభ్‌సిమ్రన్, ప్రియాంశ్, అయ్యర్, ఇంగ్లిస్, వధేరా, శశాంక్, స్టొయినిస్, జాన్సెన్, బార్ట్లెట్, అర్షదీప్, చాహల్
RCB: సాల్ట్, కోహ్లీ, పటీదార్, రొమారియో, జితేశ్, డేవిడ్, క్రునాల్, భువీ, హేజిల్‌వుడ్, దయాళ్, సుయాశ్
News April 20, 2025
విమానాన్ని ఢీకొట్టిన టెంపో వ్యాన్!

బెంగళూరు ఎయిర్‌పోర్టులో నిలిచి ఉన్న ఇండిగో విమానాన్ని ఓ టెంపో వ్యాన్ ఢీకొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. విమానం కింద వ్యాన్ ఇరుక్కున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఘటనపై ఇండిగో స్పందించింది. ‘బెంగళూరులో జరిగిన ఘటన మా దృష్టికి వచ్చింది. దర్యాప్తు జరుగుతోంది. అది పూర్తైన అనంతరం తగిన చర్యలు తీసుకుంటాం’ అని పేర్కొంది. టెంపో డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.