News December 24, 2024
తిరుపతి వాసులకు శ్రీవారి దర్శనం.. 5న టోకెన్ల జారీ
AP: తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే తిరుపతి భక్తులకు జనవరి 5న టికెట్లు జారీ చేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది. ప్రతి నెలా మొదటి మంగళవారం తిరుపతి స్థానికులకు దర్శనం కల్పించనున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జనవరి 7న దర్శనం కోసం 5వ తేదీన తిరుపతి మహతి ఆడిటోరియం, తిరుమల బాలాజీ నగర్‌లోని కమ్యూనిటీ హాల్లో దర్శన టోకెన్లు జారీ చేయనుంది.
Similar News
News December 24, 2024
నో డిటెన్షన్ రద్దు: పేరెంట్స్ మీ అభిప్రాయమేంటి?
కేంద్రం 5, 8 తరగతులకు నో డిటెన్షన్ విధానాన్ని రద్దు చేయడం AP, TGలో చర్చనీయాంశంగా మారింది. హాజరు శాతాన్ని బట్టి పై తరగతులకు ప్రమోట్ చేయడం వల్ల విద్యలో నాణ్యత కొరవడిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఐదో క్లాస్ పిల్లలకు రెండో క్లాస్ కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగహారాలు రావడం లేదన్న వార్తలు గతంలో చాలానే విన్నాం. మరి 5, 8 క్లాసులకు బోర్డ్ ఎగ్జామ్స్ ఉండాలన్న నిర్ణయాన్ని మీరు స్వాగతిస్తారా?
News December 24, 2024
వీఆర్వోల నియామక ప్రక్రియ ప్రారంభం!
TG: గ్రామాల్లో రెవెన్యూ అధికారుల నియామకానికి ప్రభుత్వం కసరత్తు మొదలెట్టింది. ఇతర శాఖల్లోకి బదిలీ అయిన వీఆర్వోలు, వీఆర్ఏల నుంచి ఆప్షన్లు స్వీకరిస్తోంది. గూగుల్ ఫామ్స్‌లో ఈనెల 28లోగా వివరాలు సేకరించాలని కలెక్టర్లను ఆదేశించింది. దాదాపు 11వేల మంది అధికారులను నియమించనుండగా, ఇందులో సగం మందిని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా తీసుకోనున్నట్లు సమాచారం. ఈ కొత్త పోస్టుల నియమ నిబంధనలపై స్పష్టత రావాల్సి ఉంది.
News December 24, 2024
భారత్‌కు ఓ గుడ్‌న్యూస్.. మరో బ్యాడ్‌న్యూస్
ప్రాక్టీస్‌లో గాయపడిన భారత కెప్టెన్ రోహిత్ కోలుకున్నారు. తాను మోకాలి గాయం నుంచి కోలుకొని 4వ టెస్టుకు రెడీగా ఉన్నట్లు రోహిత్ స్పష్టం చేశారు. అటు ఆస్ట్రేలియా బ్యాటర్ హెడ్ కూడా గాయం నుంచి కోలుకొని ఫిట్‌గా ఉన్నట్లు ఆ జట్టు కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ వెల్లడించారు. రోహిత్ కోలుకోవడం ఇండియాకు గుడ్‌న్యూస్ కాగా మనకు తలనొప్పిగా మారిన హెడ్ కూడా బాక్సింగ్ డే టెస్టుకు అందుబాటులోకి రావడం ఒక రకంగా బ్యాడ్‌న్యూసే.