News August 16, 2024
పవన్ షెరావత్‌ను దక్కించుకున్న టైటాన్స్
ప్రొ కబడ్డీ సీజన్ 11 మెగా వేలంలో స్టార్ రైడర్ పవన్ షెరావత్‌ను తెలుగు టైటాన్స్ తిరిగి దక్కించుకుంది. రూ.1.72 కోట్లు వెచ్చించి అతడిని సొంతం చేసుకుంది. అలాగే క్రిష్ణన్ ధుల్(రూ.70 లక్షలు), విజయ్ మాలిక్(రూ.20 లక్షలు)ను కొనుగోలు చేసింది. ఇవాళ కూడా వేలం కొనసాగనుంది. దీంతో మరికొంత మంది ప్లేయర్లను టైటాన్స్ దక్కించుకోనుంది.
Similar News
News September 18, 2024
BREAKING: జానీ మాస్టర్‌పై పోక్సో కేసు
TG: జానీ మాస్టర్‌పై నార్సింగి పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. మైనర్‌గా ఉన్నప్పటి నుంచి లైంగికంగా ఇబ్బందిపెట్టారన్న ఫిర్యాదుతో దాన్ని పోక్సో కేసుగా మార్చారు. తొలుత బాధితురాలు రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేయగా, అక్కడ అత్యాచారం కేసుపై FIR నమోదైంది. ఆ తర్వాత దాన్ని నార్సింగి పీఎస్‌కు బదిలీ చేశారు.
News September 18, 2024
ముగిసిన క్యాబినెట్ భేటీ
AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ముగిసింది. 4 గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో పలు కీలక విషయాలపై చర్చించినట్లు తెలుస్తోంది.
News September 18, 2024
Income Tax చట్టంలో పెను మార్పులు?
ఇన్‌కం ట్యాక్స్ చట్టాన్ని సింప్లిఫై చేయడంపై ఫైనాన్స్ మినిస్ట్రీ దృష్టి సారించింది. బడ్జెట్‌కు ముందే, 2025 జనవరిలోపు ఫాస్ట్‌ట్రాక్ రివ్యూ చేపట్టాలని చీఫ్ కమిషనర్ వీకే గుప్తా కమిటీని కోరినట్టు NDTV తెలిపింది. కాలం చెల్లిన క్లాజులు, సెక్షన్లు, సబ్ సెక్షన్లు 120 వరకు తొలగిస్తారని సమాచారం. టెలికం, సెజ్, క్యాపిటల్ గెయిన్స్ డిడక్షన్లూ ఇందులో ఉంటాయి. అవసరమైతే లా మినిస్ట్రీ సాయం తీసుకుంటారని తెలిసింది.