News April 5, 2024
కోహ్లీకి సహకరిస్తేనే ఆర్సీబీకి టైటిల్: స్మిత్
ఈ ఐపీఎల్ సీజన్‌లో ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ అత్యుత్తమంగా రాణిస్తున్నారని ఆసీస్ ఆటగాడు స్టీవ్ స్మిత్ అన్నారు. ‘కోహ్లీ ఒక్కడే రాణిస్తే ఫలితం లేదు. మిగతా ఆటగాళ్ల నుంచి అతడికి సహకారం కావాలి. జట్టులోని ఇతర ఆటగాళ్లు విఫలమవుతుంటే అతడిపై ఒత్తిడి పెరుగుతోంది. అన్ని మ్యాచ్‌ల్లోనూ కోహ్లీపై ఆధారపడడం తగదు. ఆటగాళ్లందరూ సమష్ఠిగా రాణిస్తేనే ఆర్సీబీ టైటిల్ రేసులో ఉంటుంది’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News January 22, 2025
నేడే ఇంగ్లండ్‌తో తొలి T20.. కళ్లన్నీ షమీపైనే
స్వదేశంలో ఇంగ్లండ్‌తో 5T20ల సిరీస్‌లో భాగంగా నేడు భారత్ తొలి T20 కోల్‌కతాలో ఆడనుంది. SKY సారథ్యంలో ధనాధన్ ఆటకు జట్టు సిద్ధమైన వేళ స్టార్ పేసర్ షమీపైనే కళ్లన్నీ ఉన్నాయి. గాయం నుంచి కోలుకొని జట్టులో చేరిన షమీ ఆశించిన స్థాయిలో రాణిస్తే CTలో భారత్‌కు ఎక్స్‌ఫ్యాక్టర్‌గా మారనున్నారు. అటు విజయంతో సిరీస్ ప్రారంభించాలని ఇంగ్లండ్ వ్యూహాలు రచిస్తోంది. రాత్రి 7 గం.కు స్టార్ స్పోర్ట్స్‌లో మ్యాచ్ లైవ్ చూడవచ్చు.
News January 22, 2025
27మంది మావోలు మృతి.. మృతుల్లో అలిపిరి దాడి సూత్రధారి
ఛత్తీస్‌గఢ్- ఒడిశా సరిహద్దులో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 27మంది మావోయిస్టులు చనిపోగా, వారిలో ఆ పార్టీ కేంద్ర కమిటీ పొలిట్‌బ్యూరో సభ్యుడు చలపతి(60) ఉన్నారు. ఇతను ఏపీ సీఎం చంద్రబాబుపై జరిగిన అలిపిరి దాడిలో కీలక సూత్రధారి. ఈయనది చిత్తూరు జిల్లా మాటెంపల్లి కాగా, రూ.కోటి రివార్డ్ ఉంది. చలపతి వద్ద ఎప్పుడూ ఏకే 47, ఎస్ఎల్ఆర్ వెపన్స్ ఉంటాయని, చుట్టూ 8- 10 మంది మావోలు సెక్యూరిటీ ఉంటారని సమాచారం.
News January 22, 2025
ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజ్‌లు మళ్లీ రానున్నాయా?
ఇప్పుడంటే ఇంటర్నెట్ సౌకర్యం పెరిగి జాబ్‌ల వివరాలు చేతి వేళ్ల దగ్గరికొచ్చాయి గానీ, 1970, 80 యువతకు ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజ్‌లే దిక్కు. మళ్లీ వాటిని తీసుకొచ్చి పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ఓ జాబ్ పోర్టల్ తీసుకురానున్నట్లు సమాచారం. అందులో ప్రైవేటు కంపెనీలు ఉద్యోగ ఖాళీలను రిపోర్ట్ చేయాలి. మార్గదర్శకాలు పాటించకపోతే చర్యలు తీసుకునే అవకాశముంది.